టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజ్ అమాంతం ఢమాల్ అయిపోయింది. గత కొద్ది యేళ్లుగా నాగార్జున చేస్తోన్న సినిమాలు వరుస పెట్టి ప్లాపులు అవుతున్నాయి. సినిమాలు ప్లాపులు అవ్వడంలో వచ్చిన ఇబ్బంది లేదు. అసలు మరీ ఘోరంగా రాంగోపాల్ వర్మ సినిమాలను జనాలు ఎలా లైట్ తీస్కొంటారో ? అదే పరిస్థితి నాగార్జున సినిమాలకు కూడా వచ్చేసింది. నాగార్జున ఆఫీసర్ – వైల్డ్ డాగ్ – మన్మథుడు 2 సినిమాలు ప్లాప్ అవ్వడంతో పాటు నాగార్జున పరువు కూడా తీసేశాయి.
అసలు ఈ సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే వసూళ్లు రాలేదు. ఇక తాజాగా నాగార్జున నటించిన మరో కళాఖండం ది ఘోస్ట్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తార్. మరీ తీసిపారేయ దగ్గ దర్శకుడు కాదు. సినిమా మరీ దారుణంగా లేకపోయినా జస్ట్ ఓకే అన్న టాక్ కూడా తెచ్చుకుంది. కట్ చేస్తే ఓపెనింగ్స్ లేవు. రెండో రోజుకే చాలా చోట్ల బిచానా ఎత్తేసింది. బంగార్రాజులో నాగచైతన్య ఉండి కూడా సినిమాకు మంచి టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేదు.
ది ఘోస్ట్‌కు నైజాంలో 5.50 కోట్లు – సీడెడ్‌లో 2.50 కోట్లు – ఆంధ్రాలో 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఏపీ, తెలంగాణలో ఓవరాల్‌గా రు. 16 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా రు. 21.15 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక 9వ రోజు ది ఘోస్ట్ వసూళ్లు ఏపీ, తెలంగాణలో కేవలం రు. 4 లక్షలు మాత్రమే. ఇది నాగార్జున స్థాయి హీరోకు చాలా చాలా తక్కువ. నిజం చెప్పాలంటే నాగార్జునకు ఉన్న పరువు కూడా ది ఘోస్ట్ తీసేసినట్లయ్యింది.
ఓవరాల్‌గా నాగార్జునను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఇప్పటకీ అయినా తన వయస్సుకు తగ్గ పాత్రలు చేసుకోకుండా ది ఘోస్ట్, ఆఫీసర్, మన్మథుడు 2 అంటూ ముసలి వయస్సులో ఈ వేషాలు వేస్తే ఎవరు మాత్రం చూస్తారు.. బాలయ్య, వెంకటేష్‌లా వైవిధ్యమైన పాత్రలు వేస్తేనే లైఫ్ ఉంటుంది. మరి నాగ్ తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పించే పాత్రలు చేస్తాడా ? లేదా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడా ? అన్నది చూడాలి.