టాలీవుడ్లో అక్కినేని నాగార్జునకి డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. కింగ్, మన్మధుడిగా నాగార్జునకి ఉన్న స్టార్ డం.. ఏ దర్శకుడైనా ఆయన పిలిచి సినిమా చేయమంటే చేయాల్సిందే. పలానా అమ్మాయిని హీరోయిన్గా పెట్టాల్సిందే అంటే పెట్టి తీరాల్సిందే. అంతపట్టుదలగా ఉంటారు. ఇక పూరి జగన్నాథ్ తను రాసుకున్న కథకి ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్ ఏమాత్రం ఆలోచించకుండా నిర్మాతతో పెట్టిస్తారు.
ఆయన నిర్మాత అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మేకింగ్ పరంగా ఎంత బడ్జెట్ అవుతుందో సినిమా రిలీజయ్యాక లాభాలు వచ్చినా పట్టించుకోకుండా చిత్ర యూనిట్ మొత్తానికి ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రిప్ వేస్తారు. అలా ఉంటుంది పూరితో. ఇక నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థలో తీసే ప్రతీ సినిమాకి మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉండేలా చూసుకుంటారు. అంతేకాదు, భోజనం విషయంలో ఛాయిస్ ఇస్తారు.
అలా ఇద్దరిదీ ఓ ప్రత్యేకమైన శైలి. అయితే, హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇద్దరూ మంచి రొమాంటిక్ పర్సన్స్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. ఆన్‌స్క్రీన్ మీద నాగార్జున రొమాంటిక్ సీన్స్ చేయాలంటే చాలా ఆతృతగా ఉంటారు. ఆయనతో నటించే హీరోయిన్స్ కూడా అంతే ఆరాట పడతారు. ఇక పూరి విషయానికొస్తే సాంగ్స్ పిక్చరైజేషన్ సమయంలో రొమాంటిక్ ఫీల్ వచ్చే వరకూ కాంప్రమైజ్ కారు. పూరి జగన్నాథ్ తీసే ప్రతీ సినిమాలో ఓ బీచ్ సాంగ్ తప్పని సరి.
ఆ ఒక్క సాంగ్ సినిమా చూస్తున్నంత సేపు జనాలకి హీటెక్కిస్తుంది. నాగార్జున, పూరి కాంబోలో వచ్చిన సూపర్ సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ బాగా ఉంటాయి. ఆ సినిమాలో అనుష్క, అయేషా ఇద్దరితోనూ నాగ్ అదిరిపోయే రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ చేయించాడు. కానీ, ఆ సాంగ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా చాలా ఇబ్బంది పడిందట. ఇటు పూరి, అటు నాగార్జున రొమాంటి సాంగ్ సమయంలో సీన్స్ చిత్రీకరణ సమయంలో కాస్త ఇబ్బంది పెట్టారట.
దాంతో సూపర్ సినిమా తర్వాత మళ్ళీ ఆయేషా టాకియా తెలుగు సినిమా అంటే భయపడింది. అదే సినిమాతో పరిచయమైన అనుష్క కూడా ఇలా ఇబ్బంది పడినా ఆ తర్వాత పరిస్థితులు వంటబట్టించుకొని..సెటిలైంది. కానీ, ఆయేషా మాత్రం ఇక నాకు తెలుగు సినిమా వద్దంటే వద్దని గుడ్ బై చెప్పిందట.