ఎస్ సినీ ఇండస్ట్రీలో నిజంగా ఇది ఒక సంచలనం అనే చెప్పాలి . ఇప్పటివరకు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్లే కోటి.. రెండు కోట్లు పారితోషకం తీసుకుంటూ వచ్చారు. అయితే ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా ఐదు కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది .ఆ వివరాలు ఏంటో పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం..!!
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరా అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు తమన్ . యస్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు గత మూడు సంవత్సరాలుగా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసింది తమన్ నే. అలా వైకుంఠపురం , అఖండ, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ , గాడ్ ఫాదర్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని ఎస్ ఎస్ తమన్ చరిత్ర సృష్టించాడు.
దీంతో ప్రతి స్టార్ హీరో వాళ్ళ సినిమాలకి తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయాలని అడిగిమరీ పెట్టించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ ఎస్ తమన్ నే ఎంపికయ్యారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తమన్ ఏకంగా ఐదు కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.
ఇప్పటివరకు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతటి పారితోషకం తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా సరి కొత్త సంచలన రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే తమన్ కెరియర్ ఇక దూసుకుపోతుందనే చెప్పాలి . మరి చూడాలి ఈ సినిమాతో తమన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో..?