సీతారామం సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఆ సినిమా హీరోయిన్ అయిన మృణాల్ ఠాకూర్ కూడా కారణమనే సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు మృణాల్ కొత్త అయినా ఆమె అద్భుతంగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీరియల్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమా హీరోయిన్ అయిన మృణాల్ ఠాకూర్ తన సినీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తాజాగా ఒక సందర్భంలో మృణాల్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మహారాష్ట్రలో పుట్టి పెరిగానని.. మొదట డెంటిస్ట్ కావాలని అనుకున్నానని ఆ తర్వాత మీడియాలోకి వెళ్లాలని భావించగా చాలామంది వెక్కిరించారని ఆమె తెలిపారు. నా చదువు వల్ల తండ్రికి సైతం అవమానాలు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. నాన్నకు ఎదురైన అవమానాల వల్ల చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.
కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని కాలేజ్ కు వెళ్తున్న సమయంలో డోర్ దగ్గర నిలబడి బయటకు దూకేయాలని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ సలహాలను అనుసరించి సినిమాల్లోకి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశానని సీరియళ్లు చేసుకునే నేను సినిమా హీరోయిన్ గా పనికిరానని కొంతమంది అవమానించారని ఆమె తెలిపారు.
సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆమె కామెంట్లు చేశారు. లవ్ సోనియా అనే సినిమాలో వేశ్యా గృహంలో ఉన్న చెల్లిని కాపాడుకునే అక్క పాత్రలో నేను నటించానని వేశ్యా గృహంలో ఉండే వాళ్ల అనుభవాలు తెలుసుకోవడానికి రెండు వారాల పాటు వేశ్యాగృహంలో ఉన్నానని ఆమె అన్నారు. వేశ్యాగృహంలో ఉన్నవాళ్ల కథలు విని తట్టుకోలేకపోయానని ఆమె కామెంట్లు చేశారు. మృణాల్ ఠాకూర్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.