మెగాస్టార్ చిరంజీవి నటించిన లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ఈ రోజు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఓవర్సీస్ టాక్ ప్రకారం సినిమాకు మంచి టాకే వచ్చింది. ఫస్టాఫ్ వరకు చూస్తే సినిమా ఎంగేజింగ్‌గానే ఉంది. ఆసక్తిగా ఉన్న కథనంకు తోడు ట్విస్టులు ఆకట్టుకున్నాయి. చిరు స్క్రీన్ ప్రెజెన్స్, సత్యదేవ్ నటన కూడా ఫస్టాఫ్‌లో మెప్పించాయి.
సెకండాఫ్‌లో మోస్ట్ అవైటెడ్ జైల్ ఫైట్, పూరి జగన్నాథ్ చిరును కలవడం, ఓ సీరియస్ ఇన్వెస్ట్‌గేషన్ నడుస్తుండడం, నయనతార సత్యదేవ్ అసలు రంగు తెలుసుకోవడం, చిరును కలిసి కొన్ని కీలక విషయాలు చెప్పడం ఇవన్నీ సినిమాను ఆసక్తిగా ముందుకు నడిపించాయి. మాస్ నెంబర్ బ్లాస్ట్ బేబీ సాంగ్ ఇరగదీసింది. అలాగే సెకండాఫ్‌లో సల్మాన్ మరియు చిరు లు కలిసి విలన్స్ తో ఫైట్ చేయడం మాస్ ప్రేక్షకులకు మాంచి ఫీస్ట్.
కొన్ని కీలక పొలిటికల్ సీన్లు వస్తాయి. ఆ వెంటనే అవైటెడ్ తార్ మార్ తక్కర మార్ సాంగ్‌లో చిరు సల్మాన్ ల డాన్స్ లు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంటాయి. ఓవరాల్‌గా దర్శకుడు మోహనరాజా ఒరిజినల్‌కు చెరపకుండా సూపర్ పొలిటికల్ ఎంగేజింగ్ డ్రామాను తెరకెక్కించాడు. బాస్ ఈజ్ బ్యాక్ అనాల్సిందే. థమన్ మ్యూజిక్ కూడా సినిమాలో సీన్లను బాగా ఎలివేట్ చేసింది.
గాడ్ ఫాదర్ ను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తగినన్ని మార్పులు ఉన్నాయి. బ్రహ్మ పాత్ర కోసం చిరును తీర్చిదిద్దిన తీరుకు దర్శకుడు మోహనరాజాకు హ్యాట్సాప్ చెప్పాలి. నయనతార, సత్యదేవ్ పాత్రలకు బాగా సరిపోయారు. సల్మాన్, మోగాస్టార్ ఇద్దరిని తెరపై చూడడం కన్నా ఆనందం ఏం ? ఉంటుంది. అయితే స్లో నెరేషన్‌తో పాటు సల్మాన్ పాత్రలో డెప్త్ లేకపోవడం మైనస్. ఓవరాల్‌గా గాడ్ ఫాదర్ మెగాస్టార్ కం బ్యాక్ ఫిల్మ్.