టాలీవుడ్‌లో పెద్ద ఫ్యామిలీ అయిన మెగా క్యాంప్ లో పరిస్థితులు చిత్రంగా వున్నాయి. ఇప్పటికే అల్లు కాంపౌండ్, మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉందన్నది నిజం. అయితే బయటకు ఎంత కవరింగ్ కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నా అరవింద్ మాత్రం మెగా కాంపౌండ్‌కు బాగా దూరం జరుగుతూ వస్తున్నాడు. ఇటు అల్లు అర్జున్ అయితే అసలు మెగా కాంపౌండ్ హీరో అన్న ముద్ర ఎప్పుడో తుడిచేసుకున్నాడు. అసలు ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా అల్లు ఆర్మీ పేరుతో అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లతో స్నేహంగా ఉంటూ చివరకు బావ అనే వరకు వెళ్లిపోయాడు. అంత బలమైన అనుబంధాన్ని జూనియర్‌తో ఏర్పరుచుకున్నాడు. నందమూరి కాంపౌండ్‌లో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్‌తోనే బన్నీ అంత అనుబంధం కోరుకుంటుండమే పెద్ద ట్విస్ట్. అటు అరవింద్ కూడా అదే నందమూరి కాంపౌండ్ స్టార్ హీరో బాలయ్యతో రోజు రోజుకు మరింత స్ట్రాంగ్ రిలేషన్ కోరుకుంటున్నాడు.
తన ఆహా ఓటీటీకి బాలయ్య చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్‌తో అల్లు నందమూరి బంధం బలంగా అల్లుకు పోయింది. పైగా ఈ టాక్ షోకు బాలయ్యను హోస్ట్ డిసైడ్ చేయడంతో పాటు ఆయనకు స్వయంగా ఫోన్ చేసింది అల్లు అర్జునే. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ 2 సీజన్‌కు ఏకంగా చంద్రబాబు, లోకేష్ వచ్చారు. అరవింద్ స్వయంగా చంద్రబాబుకు ఎదరేగి మరీ బొకే ఇచ్చి ఆహ్వనించారు.
ఇవన్నీ జరిగినవే.. ఇప్పుడు కొత్త పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చిరు వాల్తేరు వీరయ్యకు పోటీగా బాలయ్య వీర సింహారెడ్డి కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కాలు దువ్వుకుంటున్నారు. ఈ వార్‌లో అల్లు, బన్నీ అభిమానులు కూడా బాలయ్యకు సపోర్ట్ చేస్తోన్న వాతావరణం కనిపిస్తోంది. అసలు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు చిరుయే గెస్ట్‌గా వస్తారని అనుకున్నారు. అయితే అరవింద్ చిరును పిలిచే విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతోనే చంద్రబాబు, లోకేష్ వచ్చారు.
ఇక తన తండ్రి తరం నుంచే నందమూరి – అల్లు బంధం ఉందని బాలయ్యే స్వయంగా చెప్పారు. ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే అల్లు అరవింద్ తన మూడో కుమారుడు శిరీష్ సినిమా ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలయ్యనే పిలుస్తున్నాడు. బాలయ్య కూడా పవన్‌ను ఈ షోకు ఎప్పుడు వస్తాడని ఓపెన్‌గానే ప్రశ్నించాడు. సరే ఇక రాజకీయంగా కూడా పవన్ – చంద్రబాబుకు దగ్గరవుతున్నట్టే ఉంది. ఈ పరిణామలు అన్నీ చూస్తుంటే అల్లుతో మెగా గ్యాప్ పెరిగి పెద్దదైపోయిందన్న సందేహాలే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.