సరిత అంటే ఈ తరం జనరేషన్ వాళ్లు చాలా మంది గుర్తు పట్టరు. కానీ మరోచరిత్ర సరిత అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. కమల్‌హాసన్ హీరోగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో సరిత నట విశ్వరూపం చూపించింది. ఈ సినిమాతోనే ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. సరిత తల్లిదండ్రులు చక్రధర్‌రావు, స్వరూపరాణి. సరిత స్వస్థలం ఏపీలోని గుంటూరు.
సరిత ముందుగా పంతులమ్మ సినిమాలో రంగనాథ్ పక్కన నటించింది. సరితకు ఎర్లీ డేస్‌లోనే తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ తర్వాత వెంకట సుబ్బయ్యకు సరితకు గ్యాప్ రావడంతో విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత వెంకట సుబ్బయ్య ఆంధ్రభూమి పత్రికలో సరిత తనను మోసం చేసి విడాకులు తీసుకుందని అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూ సెన్షేషనల్ అయ్యింది.
ఆ తర్వాత ఆమె మరోచరిత్ర సమయంలో కమల్ హాసన్‌తో ప్రేమలో పడిపోయిందని కూడా అంటారు. కమల్ కూడా ఆమె అమాయకపు చూపులకు పడిపోయాడట. కమల్‌ది వాడుకుని వదిలేసే మనస్తత్వం కదా.. సరితను వదిలించుకున్నాడు. ఆ తర్వాత ఆమె అప్పట్లో యంగ్ సినిమాటోగ్రాఫర్‌గా పాపులర్ అవుతోన్న నవకాంత్‌ను ప్రేమించింది. అయితే దురదృష్టవశాత్తు నవకాంత్ చిన్న వయస్సులోనే మరణించాడు.
ఆ తర్వాత మళ్లీ మళయాళీ అయిన ముఖేష్‌ను ప్రేమించింది. ఈ దంపతులకు తేజ, శర్వాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 ఏళ్లకు పైగా కాపురం చేశాక సరిత,ముఖేష్ విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు. భర్తతో విడిపోయాక కూడా ఆమె ఇండిపెండెంట్‌గా కూడా సక్సెస్ అయ్యింది. పెళ్లయ్యాకే ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రదానం చేసింది.
అలా డబ్బింగ్ ఆర్టిస్టుగానే అప్పట్లో హీరోయిన్లకు కాస్త అటూ ఇటూగా సమానమైన రెమ్యునరేషన్ అందుకునేది. సెకండ్ ఇన్సింగ్స్‌లో మహేష్‌బాబు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రకాష్‌రాజ్‌కు జోడీగా నటించింది. ఈ సినిమాలో లేడీ విలన్‌గా కేక పెట్టించింది.