సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ని డైరెక్టర్స్ ఇబ్బంది పెట్టడం సర్వసాధారణం . కొందరు కావాలనే హీరోయిన్స్ ని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తే మరికొందరు పొరపాటున సినిమా షూటింగ్లో భాగంగా కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ స్టార్ డైరెక్టర్ తేజ కూడా పొరపాటున స్టార్ హీరోయిన్ కాజల్ తో చేసిన పని గతంలో సంచలనాన్ని క్రియేట్ చేసింది. మనకు తెలిసిందే తేజ డైరెక్షన్లోనే కాజల్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది . నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది అందాల భామ కాజల్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దీంతో కాజల్ పేరు అందరికీ తెలిసేలా తన పేరు కి పాపులారిటీ దక్కించుకుంది . ఇక ఈ సినిమా తర్వాత మగధీరలో నటించిన కాజల్ ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయింది . అయితే లక్ష్మీ కళ్యాణం తర్వాత కాజల్ మళ్ళీ తేజ డైరెక్షన్లో చేసిన సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. ఈ సినిమాలో కాజల్ పెర్ఫార్మెన్స్ చాలా మంది హోమ్లీ లేడీస్ కి దగ్గరగా అనిపించింది. భర్త కోసం ఏదైనా చేయాలనుకునే భార్య చివరికి తన ప్రాణాల్ని ఇచ్చే విధంగా స్టోరీ రాసుకున్నాడు తేజ .
అయితే తేజ డైరెక్షన్ నటించడానికి హీరోయిన్స్ భయపడతారు. దానికి ప్రధాన కారణం ఆయన కోపం, చెప్పిన సీన్ చెప్పినట్లు చేయకపోయినా. ఆయన అడిగిన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా . చంప పగలగొడతారు తేజ అనే పేరు ఉంది. అయితే కాజల్ కూడా అలాంటి కోపానికి బలైందట. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తో కాజల్ నటించింది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సీన్స్ తెరపై హైలెట్గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఓ సీన్ ఉంటుంది కాజల్ రానా దగ్గరగా ఉండే సీన్ ఆయన వెనకనుంచి హగ్ చేసుకుని ఉంటాడు. అయితే కాజల్ మాత్రం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేక పోయిందట .అప్పుడు స్వయంగా తేజ కాజల్ ని వెనకనుంచి హగ్ చేసుకున్నారట.
ఆ టైంలో కాజల్ ఇబ్బందిగా ఫీల్ అయిందట. ఈ విషయం తేజకి చెప్పుకోలేక చెప్తే ఎక్కడ అరుస్తారో అని ఆయన చేతులు ఆమె ప్రైవేట్ బాడీ పార్ట్స్ టచ్ అవుతున్నా కానీ కామ్ గా ఉండిందట . అయితే తేజ ఈ పని కావాలని చేయలేదు అని ఆమెకి తెలుసు. సినిమా షూటింగ్ ప్రాక్టీస్ లో భాగంగానే జరిగింది. ఇలా కొన్నిసార్లు తెలియకుండా కూడా తప్పులు జరుగుతాయి. సినీ ఇండస్ట్రీ అంటేనే అంత. ఇదొక పెద్ద మాయలోకం. తప్పు అని తెలిసిన తప్పక చేయాల్సిన పరిస్థితిలు ఏర్పడుతాయి.