Moviesమా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.. సంచలన విషయం...

మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.. సంచలన విషయం బయటపెట్టిన జాన్వీ..!!

రీసెంట్ గా జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ వాళ్ళ అమ్మానాన్నల గొడవల గురించి బయట పెట్టడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . మనకు తెలిసిందే శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. రీసెంట్గా ఆమె నటించిన సినిమా మిల్లి. ఈ మూవీ నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ ..”మా నాన్నగారికి ..అమ్మంటే చాలా ఇష్టం. చాలా కేరింగ్ గా చూసుకునేవాడు. ఆమెకి ఇష్టమైనవన్నీ దగ్గరుండి ఆమెకు అందేలా చేసేవాడు . అంతే కాదు అమ్మ కూడా నాన్న ఆరోగ్యం పట్ల నాన్న ఫుడ్ డైట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండేది . అయితే నాన్న కి అమ్మ అంటే ఎంత ప్రేమ ఉన్నా కానీ.. అమ్మ చెప్పిన మాట వినేవాడు కాదు. స్మోకింగ్ చేస్తూనే ఉండేవాడు . తరచూ అమ్మకు నాన్నకు ఇదే విషయాల్లో కూడా చాలా గొడవలు అవుతూ ఉండేవి. ”

“అమ్మ బతికున్న నాళ్ళు చెప్పినా కానీ నాన్న ఎప్పుడు స్మోకింగ్ మానలేదు. కానీ అమ్మ మరణించిన తర్వాత నాన్న ఎవరు చెప్పకుండానే స్మోకింగ్ మానేశాడు. అంతే కాదు ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నాన్న వాళ్లకి ఆరోగ్యం పాడైపోతుంది అంటూ సలహ ఇస్తున్నారు. హెల్త్ గురించి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏది ఏమైనా అమ్మలేని లోటు మాకు క్లియర్ గా తెలుస్తుంది ” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది జాన్వి కపూర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news