స్టార్ పొజిషన్ లో ఉన్నాక ఏ మాట మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకొని ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా వెంటనే జనాలు పట్టేస్తారు . సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్ బాధలకు గురవుతుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ జాన్వి కపూర్.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ లిస్టులో దూసుకుపోతుంది . రీసెంట్గా ఆమె నటించిన సినిమా మిలీ. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో జాన్వి కపూర్ చురుగ్గా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు టంగ్ స్లిప్ అయిన జాన్వీ.. రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ ను అడ్డంగా బుక్ చేసేసింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను “మీకు స్వయంవరం పెడితే ఏ హీరోని ఎంపిక చేసుకుంటారు” అని అడిగారు. “అప్పుడు జాన్వి రన్వీర్ సింగ్ ,టైగర్ ష్రాప్” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హోస్ట్ రన్వీర్ సింగ్ కి పెళ్లి అయిపోయింది . మరో హీరో పేరు చెప్పండి అంటాడు . అప్పుడు జాన్వి ఇంకో పేరు ఆలోచిస్తూ ఉంటుంది ..దీంతో విజయ్ దేవరకొండ మీ ఫేవరెట్ కదా అంటే ..ఆఫ్ కోర్స్ ప్రాక్టికల్లీ విజయ్ కి పెళ్లి అయిపోయింది కదా “అంటూ టంగ్ స్లిప్ అయింది .
ఆ మాటలకు అర్థం రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటూ బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయిన రష్మికకు జాన్వికాపూర్ తన మాటలతో అవకాశాలు రాకుండా చేసేసింది. ఇక పై రష్మికకు బాలీవుడ్ ఛాన్సులు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో ఉంది . ఏది ఏమైనా సరే మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక యవ్వారం వైరల్ గా మారింది.