ప్రేమ సినిమా హీరోయిన్ ప్రేమ గుర్తుంది కదా..! ధర్మ చక్రం, దేవి, మా ఆవిడా కలెక్టర్ వంటి సినిమాలతో తెలుగునాట మంచి గుర్తింపును సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు తీసిన ప్రేమ చిన్నతనం నుంచి హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. ప్రేమ ఎక్కువగా స్పోర్ట్స్ అంటే ఇష్టపడేది. తన స్కూల్, కాలేజీ డేస్ లో ప్రేమ ఎక్కువగా స్పోర్ట్స్ ని రెప్రెసెంట్ చేసేది. ఇక తన కజిన్ అయినా నేరవంద అయ్యప్ప రంజీ క్రికెటర్. ఆటగాడు. ఓ కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రేమ ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగులో మొదటి సారి నటించింది. కన్నడలో మొదటి సినిమా హిట్ అయిన తర్వాత రెండవ సినిమా ఓం లో నటిచింది.
ఓం సినిమా ఎంత పెద్ద ఘవ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.ఈ సినిమాను హీరో ఉపేంద్ర డైరెక్ట్ చేసాడు. అయితే ఓం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ – ఉపేంద్ర మధ్య నిత్యం వివాదాలు నడిచాయట. ఉపేంద్ర సినిమా పిచ్చి కారణంగా ప్రేమ చాల మానసిక క్షోభకు గురయింది. సినిమా షూటింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆ సమయంలో ప్రేమ నోరు తెరవలేదు. ఏదోలా సినిమా షూటింగ్ అయితే పూర్తయ్యింది అయితే ఈ విషయాన్ని కొన్నేళ్లు గడిచిన తర్వాత ప్రేమ బయట పెట్టడం విశేషం.
ఉపేంద్ర ఒక రోజు నా పైన కలర్స్ వేశాడని, అవి నా కళ్ళల్లో సూటిగా వచ్చి పడటంతో ఎంతో బాధ పడ్డానని ప్రేమ తెలిపింది. లొకేషన్ లో సైతం కేవలం శివన్నతో మాట్లాడుకుంటూ ఉండేవాడని, ఆడవాళ్లంటే ఆయనకు చాల చిరాకు అని తెలిపింది. ఇక ఉపేంద్ర కనీసం మానవత్వం లేకుండా నడుచుకున్నాడని వ్యాఖ్యలు చేయడంతో ఉపేంద్ర అభిమానులు ప్రేమపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.
తర్వాత ఉపేంద్ర సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. తాను ఆ సమయంలో ప్రేమతో ఆలా నడుచుకొని ఉండాల్సి కాదని, ఆమె ఈ రోజుకి నన్ను ఇంతలా ద్వేషిస్తుంది అని అనుకోలేదని ఉపేంద్ర తన బాధను వ్యక్తం చేసాడు. ఇక ఈ విషయం కొన్నాళ్ళకు సర్దు మణిగింది. ఇక పెళ్ళై, విడాకులు తీసుకున్న ప్రేమ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. సినిమాల కోసం భర్తకు విడాకులు ఇచ్చింది అనే అపవాదు ప్రేమ మూటగట్టుకుంది.
ఇటీవల కాలంలో ప్రేమకు కాన్సర్ వ్యాధి సోకిందని కూడా వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలపై స్పంచిన ప్రేమ తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ తెలిపి అందరికి షాకిచ్చింది. ఇక తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రల్లో చేయడంతో ఆమెకు సరైన స్టార్ డం దొరకలేదని చెప్పాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి