తెలుగులో స్టార్ హీరోల కూతుర్లకు సినిమాల్లో పెద్దగా ఛాన్సులు ఉండవు. హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఉన్నా వాళ్ల కుటుంబ నేపథ్యం, వాళ్ల ఫ్యామిలీ అభిమానులకు ఇష్టం లేకపోవడం.. ఎక్స్పోజింగ్ చేసేందుకు ఇష్టం లేకపోవడంతో వాళ్లు హీరోయిన్లు అవ్వడం కష్టం. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ అవ్వాలని కోరుకునేవారు. ఆమెకు ఫస్ట్ సినిమాయే బాలయ్య పక్కన టాప్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే కృష్ణ అభిమానుల ఒత్తిడితో కృష్ణ మంజులను హీరోయిన్ను చేయలేదు.
ఇక అక్కినేని మనవరాలు సుప్రియ తొలి సినిమాతోనే హీరోయిన్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారిక వచ్చింది. మూడు సినిమాలతో ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసేసుకుంది. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లు ఇద్దరూ హీరోయిన్లు అయ్యారు. వీరు ఆపర్లే టార్గెట్‌గా ముంబై హీరోయిన్లతో పోటీ పడుతూ మరీ అందాలు ఆరబోస్తున్నారు. అయినా వీరిని పట్టించుకునే వాళ్లే లేరు.
ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఆకట్టుకునేందుకు గేట్లు ఎత్తేస్తోంది. అందాలు ఆరబోసే విషయంలో కూడా ఆమె ఏమాత్రం మొహమాట పడడం లేదు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు తన తండ్రి దర్శకత్వంలోనే నటిస్తోంది. ఐశ్వర్య అర్జున్ అందాల ఆరబోతపై సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంటోంది.
రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ అని అనిపించుకునేందుకు ఐశ్వర్య పడుతోన్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆమె ఛాన్సుల కోసమే అందాలు ఆరబోసే విషయంలో మెల్లగా గేట్లు ఎత్తివేస్తోన్న పరిస్థితే ఉంది. ఇక స్కిన్ షో కూడా ఐశ్వర్య మామూలుగా చేయడం లేదు. మరి ఈ అందాల ఆరబోత అయినా ఐశ్వర్యకు ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో ? చూడాలి.