దివ్య భారతిని గురించి తెలియని వారెవరూ ఉండరు. తొలిముద్దు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ క్యూటీ అతి కొద్ది కాలంలోనే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులర్ హీరోయిన్‌గా మారింది. ఒకరకంగా రంభకి కెరీర్ ఇచ్చింది దివ్య భారతి అను తప్పక చెప్పుకోవాల్సిందే. దివ్య భారతి అకాల మృతి వల్లే రంభ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో దివ్య భారతి నటించిన సినిమాలు దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్సే.
వెంకటేష్‌తో బొబ్బిలిరాజా, మెగాస్టార్ చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. హిందీలో నటించిన సినిమాలూ సూపర్ హిటే. 17 – 18 ఏళ్లకే ఆమెకు కళ్లు చెదిరిపోయే స్టార్‌డం వచ్చింది. అలాగే ఐటెం సాంగ్స్‌లోనూ అదరగొట్టింది దివ్య భారతి. ఇన్ని బ్లాక్ బస్టర్ చేసిన దివ్య భారతి గురించి ఓ టాక్ వినిపిస్తూ ఉండేది. తను బాగా డ్రింక్ చేసేదట. అలాగే సిగరెట్లు బాగా తాగేదని చెప్పుకున్నారు. ఓ పెగ్ పడితేగానీ, కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయలేదనే మాట వినిపించేది.
పెగ్ వేసినా కూడా ఏమాత్రం తేడా కనిపించకుండా సీన్స్ చేసినా సాంగ్స్ చేసినా అద్భుతంగా నటించేది. ఎమోషన్స్, రొమాంటిక్ ఫీలింగ్స్… సాంగ్స్‌లో మూమెంట్స్ ..ఇలా అన్నింటిలోనూ ఎంతో పర్ఫెక్ట్‌గా నటించింది. ఒక షాట్ బాగా రాకపోతే తనే మళ్ళీ మళ్ళీ రీ టేక్ చేద్దామని దర్శకుడికి చెప్పి చేసేదట. బాగానే ఉంది అంటే కూడా నో అని.. తనకు సంతృప్తి కలిగేవరకూ ఆ షాట్‌ను రీ టేక్స్ చేసి ఇంకా బెటర్‌గా చేసేదని తన సరసన నటించిన హీరోలు..ఇతర నటీనటులు చెప్పేవారు.
మెగాస్టార్‌తో కలిసి రౌడూ అల్లుడు సినిమాలో నటించింది. ఇందులో శోభన కూడా మరో హీరోయిన్. కానీ, ఎక్కువ సాంగ్స్, సీన్స్ చిరుతో దివ్య భారతికే ఉంటాయి. ఇందులో ఉన్న సాంగ్స్ విషయంలో దివ్య భారతి బాగా కష్టపడిందట. ముఖ్యంగా లవ్‌లీ మై హీరో సాంగ్ కోసం దివ్య భారతి చిరంజీవి మంచు ప్రదేశంలో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటుంటారు.
ఈ సాంగ్‌లో ఒకచోట చిరు, దివ్య భారతీని ఎదపై గుద్దుతాడు. ఈ షాట్ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో చాలాసార్లు అలా గుద్దాల్సి వచ్చిందట. సాధారణంగా ఇంకో హీరోయిన్ అయితే, ఒప్పుకునేది కాదేమో. కానీ, దివ్య భారతి పర్ఫెక్ట్ కోసం తన ఎదపై చిరు ఎదురుగా వచ్చి అన్నిసార్లు ఢీ కొట్టినా తట్టుకుందని అపట్లో మాట్లాడుకునేవారు.