నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన కెరీర్లో 107వ సినిమాలో నటిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటిస్తోంది. బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ “అఖండ“ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసే సినిమా కూడా డిసెంబర్ నుంచి పట్టాలు ఎక్కనుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది కాలంలో బాలయ్య సినిమాలకు మార్కెట్ భారీగా పెరగటం ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలయ్య తన తండ్రి బయోపిక్ సినిమాలు `కథానాయకుడు`, `మహానాయకుడు` సినిమాల్లో నటించారు. వాస్తవంగా ఆ రెండు సినిమాలు అంత తీసిపారేసేదగ్గ సినిమాలు కూడా కాదు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన `రూలర్` సినిమా సైతం అట్టర్ ప్లాప్ అయ్యింది. మధ్యలో కరోనాతో రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆహా ఓటిటి అన్ స్టాప్టబుల్ తో బాలయ్య దుమ్మురేపేశాడు. ఆ తర్వాత వచ్చిన `అఖండ` సినిమాకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. అమెరికాలోని ఈ సినిమా దుమ్ము రేపేసింది.
ఒకప్పుడు బాలయ్య సినిమాలు వస్తున్నాయంటే అమెరికాలో పెద్దగా పట్టించుకునే వారు కాదు. `గౌతమీపుత్ర శాతకర్ణి` లాంటి సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు సాధించాయి. అయితే `అఖండ` అమెరికాలో తిరుగులేని సక్సెస్ సాధించింది. తాజాగా రీ-రిలీజ్ అయిన `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా అక్కడ మిలియన్ డాలర్ వసూళ్లు రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఏదేమైనా గత ఏడాది కాలంలో అమెరికాలో బాలయ్య మార్కెట్ విపరీతంగా పెరిగింది. అక్కడ బాలయ్య పేరు చెపితేనే పూనకాలతో ఊగిపోతున్నారు.
అన్ స్టాప్టబుల్ షో ద్వారా బాలయ్యకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిందా..? లేదా అఖండ నుంచి పెరిగిందా..? అన్నది అయితే తెలియటం లేదు గాని, బాలయ్య మార్కెట్ మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది.
బాలయ్య ప్రస్తుతం చేస్తున్న మలినేని గోపీచంద్ సినిమాకు ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ నుంచి భారీ బిజినెస్ డీల్ ఆఫర్లు కూడా వెలువెత్తుతున్నాయి.