టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు సినీ ఇండస్ట్రీ తమన్నా చేసిన కామెంట్స్ కి షాక్ అయిపోయింది. మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమా ద్వారా చాలా హ్యాపీగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్నా ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది .ఇక తర్వాత తమన్న అందాలకు మైమరిచిపోయిన మన తెలుగు హీరోలు ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారు . దీంతో ఒక్కసారిగా తమన్న పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది.
వరుస అవకాశాలతో చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ తమన్నా కోలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదించుకున్నింది. అంతేకాదు టాలీవుడ్ కోలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం తమన్నా ఆశించినంత హిట్ అందుకోలేకపోయింది . ఈ క్రమంలోనే తమన్నా కు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్లి ప్రజెంట్ టాలీవుడ్-బాలీవుడ్-కోలీవుడ్ మూడు భాషలలో నటిస్తూ అభిమానులకు తన అందాల విందును వడ్డిస్తుంది.
కాగా రీసెంట్ గా తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ఓటిటిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయి హిట్‌ను అందుకోలేకపోయింది . ఈ క్రమంలోనే తమన్న మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేసింది. ” అందరూ అమ్మాయిలకు ఎదూరైన్నట్లే నాకు మా ఇంట్లో నుంచి ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. వయసు 32 వచ్చేస్తుంది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేద్దామని అనుకుంటున్నాను అంటూ మీడియా ముఖంగానే తమన్నా చెప్పుకోరావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీంతో తమన్నా పెళ్లి చేసుకొని పిల్లలకంటే ఇక సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతుందా అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!