కహోనా ప్యార్ హే సినిమా ద్వారా హిందీ చిత్ర సీమలో తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 47 ఏళ్ళ అమీషా పటేల్ ఇప్పటికి సింగిల్ గా ఉండి ఎంతో మందితో బ్రేకప్ కూడా చేసుకుంది. ఇక ఆమె సినిమాలతో కన్నా అఫైర్స్, గొడవలతోనే ఎక్కువుగా వార్తల్లో ఉండేది. ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో ఆలియా భట్ తండ్రి మహేష్ భట్‌తో ఆమె ఐదేళ్ల పాటు సహజీవనం చేసింది. వీరి పై అప్పట్లో మీడియా అనేక వార్తలను ప్రచురించినా ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. కానీ పటేల్ – భట్ ఫ్యామిలీలో వీరి బంధం ఒక అలజడి సృష్టించింది.
అమీషా తో బ్రేకప్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సంస్థతో మహేష్ భట్ ఈ విషయాన్నీ కన్‌ఫర్మ్ చేశాడు. తాము ఇప్పుడు విడిపోయామంటూ చెప్పి తమ రిలేషన్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ బ్రేకప్ ద్వారా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని అమీషా కుటుంబం తెలపడం విశేషం. ఇక ఇదే సమయంలో అమీషా తన సొంత తండ్రి పై కేసు కూడా పెట్టింది. అమీషా సినిమాల్లో సంపాదించినా డబ్బుకు ఆమె తండ్రి హక్కుదారుడిగా ఉంటూ ఫామిలీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసాడు.
అయితే అది లాస్ అవ్వడంతో అమీషా తన కుటుంబంతో గొడవకు దిగింది. ఎవరు ఏం చెప్పిన వినడానికి సిద్ధంగా లేని అమీషా తన 120 మిల్లియన్ల రూపాయల డబ్బుని వెనక్కి తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్ట్ నుంచి తండ్రికి నోటీసులు పంపింది. ఇక కొన్నేళ్ల పాటు ఈ వివాదం కొనసాగుతుండగానే మహేష్ భట్ కు దూరం అయినా అమీషా మరోసారి ప్రేమలో పడింది. లండన్ వ్యాపారవేత్త కనవ్ పూరి అనే వ్యక్తితో 2008 లో అమీషా కెమెరాలకు చిక్కింది. అయితే ఈ విషయం ఆమె దాచాలనుకోలేదు. అయితే ఈ మధ్యలోనే ఆమె తెలుగులో నటించిన తొలి హీరో పవన్ కళ్యాణ్‌తోనూ, అటు హృతిక్ రోషన్‌తోనూ కూడా ప్రేమలో పడిందన్న పుకార్లు వినిపించాయి.
ప్రతి సారి మీడియా ముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అమీషా తన ప్రేమ వ్యవహారం గురించి కూడా చెప్పింది. కనవ్ పూరితో తాను ప్రేమలో ఉన్నానని, గత ఆరు నెలలుగా డేట్ చేస్తున్నామని, ఈ విషయం త్వరలోనే అందరి ముందు చెప్తానని మీడియాకు వెల్లడించింది. అయితే రెండేళ్ల ప్రేమ బంధం తర్వాత అమీషా – కనవ్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసిపోయింది.
ఇప్పటికే 50 ఏళ్ల వయస్సుకు చేరువ అవుతోన్న అమీషా పెళ్లి చేసుకోలేదు. చాలా మందితో డేటింగ్ చేస్తూ కొన్నాళ్ల పాటు రిలేషన్ లో ఉంటూ.. తర్వాత ప్రేమకు గుడ్ బై చెప్పడం ఆమెకు అలవాటుగా మారింది. ఓ సారి న్యూయార్క్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ తో గొడవకు దిగింది అమీషా. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. చివరికి అమీషాను పోలీస్ స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారు.