Moviesకూతురు మంజుల‌కు కృష్ణ ఇంత అన్యాయం చేశాడా... ప్రేమకోసం అన్నేళ్లు బందీ...

కూతురు మంజుల‌కు కృష్ణ ఇంత అన్యాయం చేశాడా… ప్రేమకోసం అన్నేళ్లు బందీ అయ్యిందా…!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కృష్ణ కుమార్తెలలో ఒకరు అయిన మంజులకు ముందు నుంచి సినిమాల్లో రాణించాలన్న కోరిక బలంగా ఉండేదట. ఆ కోరికను కృష్ణ చంపేశారని.. తన కుటుంబంలో మిగిలిన వాళ్లకు అన్ని విధాలా సాయం చేసిన కృష్ణ మంజులకు మాత్రం అన్యాయం చేశారని సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

మంజుల సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని అనుకునేవారట. అయితే కృష్ణ అభిమానులు కృష్ణ గారి కుమార్తె హీరోయిన్‌గా చేయడం ఏంటని కృష్ణ గారిపై తీవ్రమైన ఒత్తిడి చేయ‌డంతో కృష్ణ తన కుమార్తె కోరికకు ఓకే చెప్పలేదు. బాలయ్య హీరోగా వచ్చిన టాప్ హీరో సినిమాలో మంజులను హీరోయిన్గా పెట్టాల‌నుకున్నారు. కృష్ణ… సీనియర్ ఎన్టీఆర్ ను అన్ని విషయాల్లోనూ ఢీకొట్టారు. అలాంటి ఎన్టీఆర్ కుమారుడు బాలయ్యకు జోడిగా మంజుల నటించడం ఏంట‌ని.. కృష్ణ అభిమానుల నుంచి అప్పట్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే మంజుల ప్రేమా విషయంలోనూ కృష్ణ ఆమెను ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని ఆయన చెప్పారు. అప్పటికే పెళ్లయి భార్య ఉండి కూడా ఆయన విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు… తన ప్రేమ విషయంలో ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న కృష్ణ తన కుమార్తె ప్రేమ విషయంలో మాత్రం అలా ఆలోచించలేకపోయారని రామారావు చెప్పారు. మంజుల సంజయ్ స్వరూప్ ను ప్రేమించారు. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు. అయితే మంజుల ప్రేమ కృష్ణకు ఇష్టం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు ఆమె అలాగే ఉండిపోయింది.

కృష్ణకు మాత్రం తన కుమార్తెకు ఆర్థికంగా ఇంకా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్న కోరిక ఉండేదట. అందుకే మంజుల ప్రేమను ఆయన ఇష్టపడలేదని అంటారు. చివరకు 9 సంవత్సరాల పాటు మంజుల పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇటు ఆమెకు ఇష్టమైన సినీ కెరీర్ లోను కృష్ణ ప్రోత్సహించలేదు. చివరకు ఇందిరాదేవి పట్టుబట్టి కాపురం చేయాల్సింది కుమార్తె, అల్లుడు అని… వారికి ఇష్టమైతే అభ్యంతరం పెట్టవద్దని పట్టుబట్టడంతో 9 ఏళ్ల తర్వాత మంజుల ప్రేమను కృష్ణ ఓకే చేశారని రామారావు తెలిపారు.

కానీ మంజులకు సినీ రంగంలోనూ ప్రోత్సాహం ఇచ్చి ఉన్నట్లయితే ఆమె కెరీర్ మరోలా ఉండేదని కూడా ఆయన అన్నారు. పెళ్లి తర్వాత సినిమాలపై ఆసక్తి తగ్గకపోవడంతోనే ఆమె షో సినిమా చేయడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా చేసిందని రామారావు స్పష్టం చేశారు. అయితే మంజులను ఆర్థికంగా ఆదుకునేందుకు మహేష్ బాబు కాల్షీట్లు ఇచ్చి నాని సినిమా చేసినా అది కూడా సక్సెస్ కాలేదు. తర్వాత మహేష్ నటించిన మరో సినిమాలో వాటా ఇచ్చిన ఆ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో మంజుల ఆస్తులన్నీ పోగొట్టుకొని బాగా ఇబ్బందులు పడిందని కూడా ఆయన చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news