టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్నాయి. ఎన్టీఆర్‌కు టెంపర్ సినిమాకు ముందు చాలా ప్లాపులు వచ్చాయి. వరుసగా శక్తి – దమ్ము – రభస – రామయ్య వస్తావయ్య లాంటి ప్లాప్ సినిమాలతో మనోడి మార్కెట్ బాగా దెబ్బతింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్లను నమ్ముకుని సినిమాలు చేసినా ప్లాప్ సినిమాలు వచ్చాయి.
సింహా లాంటి హిట్ సినిమా తర్వాత బోయపాటిని నమ్మి దమ్ము చేస్తే ప్లాప్ అయ్యింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీశంకర్ తో రామయ్య వస్తావయ్య చేస్తే అది కూడా డిజాస్టర్ అయింది. కందిరీగ లాంటి హిట్ సినిమా ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌తో రభస చేస్తే ప్లాప్ అయింది. దూకుడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీను వైట్లతో బాద్ షా సినిమా చేస్తే అది కూడా దూకుడు స్థాయి సినిమా అనిపించుకోలేదు. ఇలా వరుసగా ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్ల వెంట పడగా ప్రతికూల ఫలితాలే వచ్చాయి.
ఈ కోవలోనే హరీష్ శంకర్ తో రామయ్య వస్తావయ్య సినిమా చేశాడు. ఆ సినిమా షూటింగ్ క్లైమాక్స్ విదేశాల్లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ వినాయక్, రాజమౌళి తప్ప ఎవరు హిట్ ఇవ్వలేకపోతున్నారు.. వరుసగా ప్లాపులు వస్తున్నాయి అని కాస్త బాధపడ్డాడట. ఆ సమయంలో కొందరు సన్నిహితులతో పాటు, రామయ్యా వస్తావయ్యా సినిమా టెక్నీషియన్లు కొందరు, డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఉన్నారట.
వెంటనే హరీష్ శంకర్ ఎన్టీఆర్ ఫేస్ మీదకు వచ్చేసి భయ్యా నేను నీకు హిట్ ఇస్తాను.. నేను నీకు బ్లాక్‌బస్టర్ ఇస్తాను.. ఈ సినిమా మాత్రమే కాదు… మళ్లీ సినిమా చేసి హిట్ ఇస్తాను అని ఓవర్ యాక్షన్ చేస్తూ కటింగ్ ఇచ్చాడట. వెంటనే ఎన్టీఆర్ కోపంతో ఎవడు ? ఎవడికి హిట్ ఇస్తారు… ఇండస్ట్రీకి నువ్వు ఎప్పుడు వచ్చావ్ ? నేను ఎప్పుడు వచ్చాను ? నువ్వు నాకు కాదు హిట్ ఇచ్చేది.. నేను నీకు మంచి ఛాన్స్ ఇచ్చాను అని కాస్త ఫైర్ అయ్యాడట.
అయితే పక్కనే ఉన్న వాళ్లు సర్ది చెప్పడంతో ఆ గొడవ అక్కడితో సర్దుమణిగింది. హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్‌కు తగ్గట్టే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కాదు కదా మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకే హరీష్‌కు చాలా రోజులు పట్టింది. ఎన్టీఆర్ నమ్మి మంచి ఛాన్స్ ఇస్తే హరీష్ చేజేతులా దానిని నాశనం చేసుకున్నాడు.