Moviesజైపూర్ కోటలో హన్సిక వివాహం..బిగ్ షాక్ ఇచ్చిందిగా..!!

జైపూర్ కోటలో హన్సిక వివాహం..బిగ్ షాక్ ఇచ్చిందిగా..!!

సినీ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. హాట్ బ్యూటీ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పనులు కూడా హన్సిక మొదలు పెట్టేసింది . అయితే ఇప్పటివరకు ఏ విషయాన్ని బయటకు లీక్ కాకుండా జాగ్రత్తగా గుట్టు చప్పుడు కాకుండా పనులు చేసుకుంటున్నా హన్సిక ..రీసెంట్గా జైపూర్ లోని ముండోటా ప్యాలెస్ వేదికను ఆమె బుక్ చేసుకోవడం ..ఆ వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో హన్సిక పెళ్లి మేటర్ బయటపడింది.

అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ హన్సిక మోత్వాని తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . జైపూర్ లోని ముండోటా ప్యాలస్ వేదికగా హన్సిక వివాహం ఘనంగా జరగనున్నట్లు ఓ న్యూస్ టాలీవుడ్ ,కోలీవుడ్, బాలీవుడ్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయట. దాదాపు తన పెళ్లి కోసం హన్సిక రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

మనకు తెలిసిందే గత కొంత కాలం నుంచి హన్సిక కోలీవుడ్ స్టార్ హీరో మాయలో పడింది . దాన్నే ప్రేమ అనుకుని అతనితో పెళ్లికి సిద్ధపదింది ఈ హాట్ బేబీ. కాగా ఇప్పటికే ఆ స్టార్ హీరో కొంతమందితో లవ్ ట్రాక్ లు నడిపి బ్రేకప్ చెప్పాడు . మళ్ళీ హన్సికతో ప్రేమను కంటిన్యూ చేస్తూ..ఇప్పుడు ఏకంగా పెళ్లి వరకు వచ్చాడు. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని ఆ కారణంగానే హన్సిక పెళ్లి వేదికను కూడా బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది . అంతేకాదు పెళ్లి కోసం నగలు చీరలు కూడా స్పెషల్ డిజైనర్స్ దగ్గర డిజైన్ చేయిస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది .అయితే ఇప్పటివరకు హన్సిక పెళ్లి పై ఆమె కానీ ఆమె బంధువులు కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. మనకు తెలిసిందే హన్సిక తెలుగులో దేశముదురు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ..ఆ తర్వాత కోలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news