ఆంధ్రాలో రాజకీయాల విమర్శలు హద్దులు దాటేస్తున్నాయి. పార్టీల అభిమానుల పిచ్చి పీక్స్ స్టేజ్‌కు చేరుకుంటోంది. రాజకీయ పరమైన విమర్శలను రాజకీయంగా చేయకుండా హద్దులు దాటేస్తూ వ్యక్తిగత విమర్శల వరకు చేరుకుంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో. ఆయన వ్యక్తిగతం వేరు… సినిమా జీవితం వేరు.. రాజకీయ జీవితం వేరు. వీటిని వేర్వేరుగా చూడని వాళ్లు ఆయన రాజకీయాల్లో ఉండడంతో వ్యక్తిగత, సినీ జీవితాన్ని కూడా టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఏపీలో ఇప్పుడు అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మామూలుగా జరగడం లేదు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన అభిమానులు కొందరు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ణు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. అక్కడితో ఆగకుండా పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా అనారోగ్యంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పవన్ ఆమెను చూసేందుకు కూడా వెళ్లడం లేదని… ఆమెతోనూ పవన్‌కు గ్యాప్ వచ్చేసిందని సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. పవన్ తమ పార్టీపై చేస్తోన్న విమర్శలకు కౌంటర్‌గా వకీల్‌సాబ్ సినిమాలో నటించిన అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు పవన్‌ను పెళ్లి చేసుకో అని కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనా సినిమా వాళ్లు కళాకారులు… వీళ్లకు పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. వీళ్ల వ్యక్తిగత, సినిమా జీవితాలు, రాజకీయాలు వేరు. రాజకీయ విమర్శల్లోకి వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం తగదని పవన్ అభిమానులు కోరుతున్నారు.