టబు.. పొడుగు కాళ్ళ సుందరి. ఆమె జీవితంలో ప్రేమలకు ఎలాంటి కొదవ లేదు. జీవితం మొత్తం ప్రేమ తోనే నిండి ఉంది. 50 ఏళ్ళ వయసులోనూ వన్నె తగ్గని ఆమె అందం ఎవ్వరిని చూపు తిప్పుకోనివ్వదు. కంటెంట్ ఉంటె చాలు ఎలాంటి బోల్డ్ పాత్ర వేయడానికైనా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సినిమా జీవితం ఎలా ఉన్న ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత అనేక మంది హీరోలతో రిలేషన్ షిప్ చేసింది. ఆలా టబు ప్రేమాయణం సాగించిన ఆ హీరోలు ఎవరో చూద్దాం.
సంజయ్ కపూర్ :
ప్రేమ్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట షూటింగ్ సెట్ లోనే ప్రేమలో పడ్డారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకొని ఫ్లాప్ అయినా వీరి బంధం మాత్రం బలపడింది. టబు పైన ఉన్న ప్రేమను సంజయ్ మీడియా సాక్షిగా బయట పెట్టడం విశేషం.
సాజిద్ నడియావాలా :
టబు కొన్నాళ్ల పాటు సాజిద్ తో కూడా ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తుంది. జీత్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారని, ఒక దశలో సీరియస్ రిలేషన్ షిప్ చేయాలని సాజిద్ భావించాడట. అయితే సాజిద్ తన మొదటి భార్య దివ్య భారతిని అప్పటికి మర్చిపోకపోవడంతో ఆ బంధం ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు.
నాగార్జున :
టబు తెలుగు హీరో అయినా నాగార్జునతో ప్రేమలో పడింది అంటూ బాలీవుడ్ మీడియాతో పాటు ఇటు సౌత్ మీడియా కూడా ఎప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి కూడా నాగార్జునతో ప్రేమ బంధమే కారణం అనే వారు కూడా ఉన్నారు. ఇక టబు తెలుగులో కూలీ నం1 సినిమాతో పరిచయం కాగా, ఆ తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సినిమాల్లో మూడు సార్లు నాగార్జున తో కలిసి నటించింది. అయితే వీరు ఇద్దరు మాత్రం మాది మంది స్నేహం బంధం అంటూ ఉంటారు.
అజయ్ దేవగన్ :
తన చిన్నతనం నుంచి అజయ్ దేవగన్ ను ప్రేమిస్తూ పెరిగానని, అతడు తన బ్రదర్ స్నేహితుడు కావడంతో అజయ్ అంటే ఇష్టం ఏర్పడింది అని ఒక ఇంటర్వ్యూలో టబు చెప్పడం విశేషం, ఇక టబు చివరి వరకు అజయ్‌ని మాత్రం తన పార్టనర్ గా ఊహించుకుంటానని చెప్పడం కొసమెరుపు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు.
మనోజ్ బాజ్‌పాయ్ :
టబు బాలీవుడ్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు అప్పట్లో హీరోగా నటించే మనోజ్ బాజ్‌పాయ్‌తో కూడా ఘాటు ప్రేమలో పడిందంటారు. యేడాది కాలంలో టబు – మనోజ్ జంటగా నటించిన మూడు సినిమాలు వచ్చాయి. మనోజ్ చిన్న సినిమాలు చేస్తూ టబును కావాలనే హీరోయిన్‌గా రికమెండ్ చేయించాడని కూడా అంటారు.