విభిన్న కథాంశాల్లో అయినా అలవోకగా ఒదిగిపోయిన నటి.. వాణిశ్రీ. ముఖ్యంగా ప్రేమకథల్లో ఎక్కువగా ఒక తరం దర్శకులు ఆమెనుఎంపిక చేసుకునేవారు. ప్రేమనగర్.. ఈకోవలో వచ్చిందే. ఈ సినిమా డూపర్ హిట్టయింది. ఇలా.. అనేక సినిమాలు ఉన్నాయి. శోభన్‌బాబుతోనూ.. చాలా సినిమాల్లో ప్రేమ కావ్యాలు పండించిన వాణిశ్రీ ఎక్కువగా.. అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌గా నటించారు. ఎన్టీఆర్ కంటే కూడా ఏఎన్నార్‌తోనే ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. అయితే..నాగేశ్వరరావుతో నటించినా.. స్టోరీ డిస్కషన్స్ మాత్రం అన్నగారితో జరిగేదట.
ఎందుకంటే.. అప్పట్లో ఒకే స్టూడియో రెండు మూడు సినిమాలకు షూటింగులు ఉండేవి. ఈ గ్యాప్‌లో అన్నగారితో ముచ్చట్లు పెట్టుకునేందుకు చాలా మంది వచ్చేవారు. అయితే..వాణిశ్రీ మాత్రం.. కథపై ఆయనతో చర్చించేదట. వాస్తవానికి ఒక్కసారి కథ రెడీ అయ్యాక.. దర్శకులు మార్పులు చేసేవారు కాదు. అయినా.. కూడా.. వాణిశ్రీ.. రామారావుగారు ఇలా అయితే బాగుటుందన్నారు.. అని దర్శకులకు చెప్పి.. వారిని ఒప్పించిన సందర్భాలు ఉన్నాయట.
గులేబకావళి కథలో జమున కూడా.. అన్నగారి సూచనల మేరకు మేకప్ వేసుకున్నారు. చీర కట్టు కూడా.. అలానే చేసకున్నారట. అంటే.. మొత్తంగా చూస్తే.. అప్పటికే.. అన్నగారికి.. కథ, నిర్వహణ.. హీరోయిన్ వంటి అంశాలపై గ్రిప్ పెరిగిందనే టాక్ ఉండేది. తర్వాత కాలంలో శారద వంటి వారు కూడా.. అన్నగారితో స్టోరీ డిస్కషన్లు చేసేవారట. అయితే.. అతి తక్కువగా మాత్రమే అన్నగారు వారికి సూచనలు సలహాలు ఇచ్చేవారట. ఎందుకంటే.. తాను చెప్పాక మారుస్తారు. ఇది నిర్మాతకు భారం కాకూడదనేది.. అన్నగారి భావన.