నందమూరి నటరత్న ఎన్టీ రామారావు తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా దేవికతో నటించారు. ఎన్టీఆర్ – దేవిక కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక క్రేజ్ ఉండేది. ఏఎన్ఆర్ – సావిత్రి కాంబినేషన్ ఎలాగో ఎన్టీఆర్ – దేవిక కాంబినేషన్ అంటే అంతే క్రేజ్. సినిమా ఫౌండర్‌గా అందరూ చెప్పుకునే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు దేవిక సమీప బంధువు అవుతారు. ఆ రోజుల్లో దేవిక అందం అంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉండేది.
అప్పట్లో ఎన్టీఆర్ – దేవిక మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉండేదన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపించింది. ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో దేవికతోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. అలాగే ఆయన కెరీర్ పరంగా చూసుకున్న దేవిక – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంత విచిత్రం ఏంటంటే శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య లాంటి నటులకు జోడిగా నటించిన దేవిక – ఏఎన్నార్ కి జోడిగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దేవిక ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడే వారని కూడా చెబుతూ ఉంటారు.
అయితే దేవిక ఎన్నో ఆస్తులు సంపాదించినా ఆమె వేసిన తప్పటడుగుల వల్ల ఆర్థికంగా చితికిపోయింది. అప్పట్లో చెన్నైలో ఉండే దేవిక తనకంటే వయసులో చిన్నవాడు అయినా దేవదాస్ అనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మాయలో పడిపోయింది. దేవదాసు.. దేవికను తన మాయమాటలతో నమ్మించాడు. మీరంటే చాలా ఇష్టం అని చెప్పడంతో దేవికి కూడా అతడి మాయలో పడిపోయింది. చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు.
దేవదాసు డైరెక్టర్‌గా నిలబెట్టేందుకు తన ఆస్తులు అమ్మి… అప్పులు చేయడంతో పాటు తన స్నేహితులు దగ్గర కూడా భారీగా అప్పులు చేసి ఓ సినిమా నిర్మించింది. అయితే ఆ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు. దీంతో దేవిక భారీగా ఆస్తులు నష్టపోయింది. దేవదాస్‌తో సహజీవనం చేయడంతో సన్నజాజిలా ఉండే దేవిక లావెక్కి పోయింది. దీంతో అటు తమిళ సినీ జనాలు హామీను పట్టించుకోలేదు. ఆమె తెలుగులో చేసిన సినిమాలు కూడా ఆడలేదు. చివరకు ఆమెకు ఛాన్సులు రాకుండా పోయాయి.
దేవిక ఎంతో నమ్మి సర్వస్వం అర్పించిన దేవదాస్ ఆమెను వదిలేసి అడ్రస్సు లేకుండా పోయాడు. దీంతో దేవిక దిక్కులేనిది అయిపోయింది. ఇక దేవిక ఒక్కగానక కుమార్తె కనక సీనియర్ హీరోయిన్ నళిని భర్త రామదాసు కు జోడిగా ఓ సినిమాలో కూడా నటించింది. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక.. తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఓ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం కోసం ఓ
కన్యక కావలసి ఉండడంతో ఎన్టీఆర్ స్వయంగా దేవికకు ఫోన్ చేసి కనకను ఈ యజ్ఞానికి పంపాల్సిందిగా కోరారట.
ఎన్టీఆర్ తనకు చాలా సన్నిహితులు కావడంతో దేవిక కూడా ఎన్టీఆర్ కోరికను కాదనకుండా కనకను ఈ యజ్ఞానికి పంపిందని… ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు రాలేదని చెబుతూ ఉంటారు. ఏదేమైనా ఎన్టీఆర్ అంటే దేవిక ఎంతో ఇష్టపడే వారని ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన ఏం చెప్పినా చేసేవారిని.. ఏం అడిగినా కాదనే వారు కాదన్న టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది.