హీరోయిన్లకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రేమ.. పెళ్లిపై దృష్టి పెడుతుంటారు. ఆఫర్లు తగ్గుముఖం పట్టగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంటారు. ఇక మరికొందరు హీరోయిన్లు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకుంటారు. ఇక హీరోయిన్లు తమ రేంజ్ కు తగినట్టుగా వరుడిని సంగతి తెలిసిందే. అక్కడ కొంతమంది బ్యూటీలు ఏకంగా మన దేశం విడిచి పక్క దేశాలకు వెళ్లి మరీ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మాధురి దీక్షిత్ :
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ విదేశీయుడిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. మాధురి దీక్షిత్ పేరు చెపితే 1990వ దశకంలో దేశం అంతా ఊగిపోయేది. 1999లో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీరామ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది.
ప్రియాంక చోప్రా :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం విదేశీయుడినే పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా వయసులో తనకంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది. నిక్ జోనాస్ సింగర్ మరియు అమెరికాలో సినిమాలలో నటిస్తుంటాడు. ప్రియాంక కంటే నిక్ ఏకంగా 10 ఏళ్లకు పైగా చిన్నోడు. ఆమె ప్రియాంకకు తమ్ముడిలా ఉన్నాడన్న విమర్శలు వచ్చినా ఆమె తన ప్రేమ కోసం ఎక్కడా వెనక్కు తగ్గలేదు.
ప్రీతిజింతా :
సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా సైతం విదేశానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ప్రీతి కేవలం బాలీవుడ్ జనాలకు మాత్రమే కాకుండా… తెలుగు వాళ్లకు కూడా పరిచయమే. తెలుగులో మహేష్ రాజకుమారుడు, వెంకీ ప్రేమంటే ఇదేరా సినిమాలు చేసింది. ప్రీతిజింతా లాస్ ఏంజిల్స్ కు చెందిన ఫైనాన్స్ దీనిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
శ్రీయా చరణ్ :
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ సైతం తెల్ల తోలునే ఇష్టపడింది. అసలు శ్రీయ తెలుగు ఇండస్ట్రీని పదేళ్లకు పైగా ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆమె రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రి కొచ్చిని పెళ్లి చేసుకుంది. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వీరికి ఓ పాప కూడా పుట్టింది.
కిమ్ శర్మ :
ఒకప్పటి బాలీవుడ్ నటి, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసిన కిమ్ శర్మ చాలా మందితో ప్రేమాయణాలు నడిపింది. ఆమె భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె తనకంటే వయస్సులో చాలా పెద్దోడు అయిన కెన్యా వ్యాపారవేత్త ఆలీ పుంజాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరు కెన్యా రాజధాని నైరోబీలో కాపురం కూడా పెట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె ఆలీని పెళ్లి చేసుకుందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అతడి టార్చర్ తట్టుకోలేక ఆమె విడాకులు ఇచ్చేసింది.