అవును.. ఎన్టీఆర్ చేసిన పనేంటి.. ఆయనపై ఉన్న ప్రచారం ఏంటి ? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల వైసీపీకి చెందిన ఒక నాయకుడు అన్నగారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్.. సినిమా షూటింగులు అయిపోయిన తర్వాత.. కాస్ట్యూమ్స్ ఎత్తుకెళ్లిపోయేవాడని.. వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ వాదన.. సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. అన్నగారు ఎన్టీఆర్ గురించి.. ఇది వాస్తవమో లేక కల్పనో తెలియదు కానీ.. ఇది మాత్రం ప్రచారంలో ఉంది.
నిజానికి అసలు ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ అనేక సినిమాల్లో నటించారు. అయితే.. ఏ సినిమాలో నటించి నా.. ఆయన కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేసేవారు. ఇలా.. ఓ సినిమాకు ప్రత్యేకంగా.. దుస్తులు తెప్పించారు. సినిమాలో ఈ కాస్ట్యూమ్‌ను అన్నగారు ధరించారు. అయితే.. వీటి గురించి.. దర్శకుడు విఠలాచార్యను ఆరా తీశారు. దానికి ఆయన పలు వివరాలు ఇచ్చారు. అదే సమయంలో అన్నగారికి.. విఠలాచార్యకు మధ్య ఉన్న స్నేహం కారణంగా.. ఆయన సదరు కాస్ట్యూమ్స్‌ను అన్నగారి అసిస్టెంట్‌కు ఇచ్చి పంపించారు.
ఇంటికి వచ్చే వరకు కూడా.. అన్నగారికి ఈ విషయం తెలిసింది కాదు. తెలిసిన తర్వాత.. విఠలాచార్యను ప్రశ్నించారు. కానీ, తాను ముచ్చటపడే వాటిని పంపించానని ఆయన చెప్పారు. తర్వాత.. దీనిపై ఎన్టీఆర్ కు అసిస్టెంట్‌గా వ్యవహరించిన `మాలోకం` వ్యతిరేక ప్రచారం చేశారు. సార్ బట్టలు తీసుకొచ్చేశారు! అని.. కొందరి దగ్గర ఊదారు. ఇలా.. ఎన్టీఆర్‌పై కాస్ట్యూమ్‌ను తీసుకువచ్చే వారనేముద్ర పడింది.
అయితే.. మాలోకం.. ఎందుకు అలా ప్రచారం చేశాడనేది ఆసక్తికర విషయం. తర్వాత.. కొన్నాళ్లకు విషయం అన్నగారి వరకు చేరి.. మాలోకాన్ని తప్పించేసి.. మన వాణ్ని పెట్టుకున్నారనుకోండి. అయితే ఈ కాస్ట్యూమ్స్ అన్నింటిని ఎన్టీఆర్ తీసుకువెళ్లి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకునేవారు. వాటిని ఓ మ్యూజియంలో పెట్టి ఓ ప్రదర్శన శాలగా మార్చేశారు. ఇది వాస్తవం కాగా… బయట మాలోకం తీరుతో మరో రకమైన ప్రచారం జరిగింది.