సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. స్టార్ హీరోయిన్ గా ఉండే త్రిష ..అడ్రస్ లేకుండా కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . దానికి కారణం వ్యక్తిగతంగా ఆమె తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయినాకానీ ఆమెకు ఉన్న గత ట్రాక్ రికార్డు కారణంగా త్రిష మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. రీసెంట్గా ఆమె నటించిన “పోనియన్ సెల్వన్” సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తమిళ్లో మాత్రం ఘన విజయం సాధించింది . ఏకంగా మూడు రోజుల్లో 200 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాలో ఎవరికి తగ్గ పాత్రలో వాళ్ళు పూర్తి న్యాయం చేశారు .మరి ముఖ్యంగా త్రిష కుందవై పాత్రలో జీవించేసింది. అంతలా ఆమె పాత్ర జనాలకు నచ్చడానికి కారణం ఆమె లీనమైపోయినటించడం. త్రిష ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడింది.. కేవలం ఫిజికల్ గానే కాదు ..మెంటల్ గా కూడా ఆమె ఆ పాత్రలో లీనమైపోవడానికి ఆ రాజుల చరిత్రకు సంబంధించిన బుక్స్ చదివేదట.
మణిరత్నం ఆమెకు స్టోరీ చెప్పగానే స్క్రిప్ట్ నచ్చేసి వెంటనే సైన్ చేసిందట త్రిష. అంతే కాదు పోనియన్ సెల్వన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. “ఆ టైంలో త్రిష మాత్రం టైం వేస్ట్ చేయకుండా.. కల్కి కృష్ణమూర్తి రాసిన “పోనియన్ సెల్వన్” నవల ఐదు భాగాలను పూర్తిగా చదివినట్టు ఈ క్రమంలోనే ఈ కథకు బిగ్ ఫ్యాన్ అయిపోయానని.. నిజానికి చరిత్ర పుస్తకాలు చదవడం తనకి ఇంట్రెస్ట్ లేదని.. కానీ మణిరత్నం చెప్పిన కాన్సెప్ట్ నచ్చి..బుక్స్ చదివానని అందుకే కుందవై పాత్రలో నేను అంత బాగా నటించగలిగానని” ఆమె చెప్పుకొచ్చింది.
అంతేకాదు కొన్నిసార్లు రాత్రులు నిద్రపోకుండా కూడా ఆ నవలలను అలాగే చదువుతూ మైండ్ కి ఎక్కిచ్చేసుకునిందట.. ఆమె నవల చదివాక ఆశ్చర్యంగా అనిపించింది” అని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఐదు భాగాలుగా నవలలు ఉన్న కథను మణిరత్నం కేవలం రెండు భాగాలు గా మాత్రమే చూపించడానికి సిద్ధపడ్డారని ..మిగతా భాగాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందని ..మణిరత్నం కచ్చితంగా మిగిలిన ఆ మూడు పార్ట్ లను కూడా తెరకెక్కిస్తే బాగుంటుందని అని చెప్పుకొచ్చింది.