కూలీ నంబర్ 1 సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది హైదరాబాదీ అమ్మాయి టబు. ముస్లిం కుటుంబం అంటేనే అమ్మాయిలకి ఎన్నో కఠిన నిబంధనలుంటాయి. అయినా కూడా వాటిని దాటుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని హీరోయిన్గా రాణించింది. టుబు అక్క ఫరా కూడా హీరోయినే. ప్రేమదేశం, నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకుంది. అయితే, తెలుగులో మాత్రం టబు సౌందర్య, సిమ్రాన్, మీనా, రోజా మాదిరిగా పదుల సంఖ్యలో సినిమాలు చేయలేకపోయింది.
బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తుంది. అక్కడ హీరోయిన్గా మాత్రమే కాదు, కీలక పాత్రలను ఒప్పుకుంది. వాటి పరంగా కూడా టబుకి మంచి గుర్తింపు వచ్చింది. చెప్పాలంటే హిందీలో ఏ పాత్ర చేసిన టబును ఆదరించారు. అక్కడ ఐటెం సాంగ్స్ కూడా చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, ఇక్కడ చేసిన సినిమాలు తక్కువే అయినా టబుకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ క్రేజ్ కింగ్ నాగార్జున వల్ల వచ్చిందనుకోవాలి.
నాగార్జునతో చేసింది ఇక్కడ రెండు సినిమాలు. ఒకటి నిన్నే పెళ్ళాడతా..ఒకటి ఆవిడ మా ఆవిడే. ఈ రెండు బ్లాక్ బస్టర్స్. అయితే, నాగార్జున – టబుల మధ్య రిలేషన్ ఉందని..షూటింగ్స్ లేకపోతే టబు నాగార్జున ఇంట్లోనే ఉండేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇది అటు నాగార్జునకి టబుకి బాగా ఇబ్బంది కలిగించింది. ఈ ప్రచారంతో టబు కూడా బాగా డిస్టర్బ్ అయ్యింది.
టబు హైదరాబాది అమ్మాయి కావడం నాగార్జున ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉండటం చాలామందికి తెలియని విషయం. అమల స్వయంగా తమ ఇంటికి ఎదురుగానే ల్యాండ్ కొని దగ్గరుండి ఇల్లు కట్టించింది. అంత సన్నిహితంగా ఉండేవారు. అయితే, ఇక్కడ వచ్చిన రూమర్స్ వల్ల టబుతో కలిసి నాగార్జున ఎక్కువ సినిమాలు చేయలేకపోయాడు. బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది.
అదే సమయంలో టబుకి బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ రావడం..అక్కడ బిజీ అవడంతో ఇక్కడ ఈ రూమర్స్‌ను ఎవరు తట్టుకుంటారు ..ఇక్కడ సినిమాలు లేకపోయినా పర్లేదు..అని డిసైడయి ముంబైకి షిఫ్ట్ అయింది. దాదాపు ఇక్కడ సినిమాలు చేయడం తగ్గించేసింది. ఎప్పుడో ఒకసారి చేసిన అందరివాడు..చెన్నకేశవ రెడ్డి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో ముంబైలోనే ఎక్కువగా గడుపుతోంది టబు.