సినిమా ఇండస్ట్రీలోకి రావాలని వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది . కానీ వాళ్లలో కొందరే ఆ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోగలరు. అయితే ఈ గ్లామరస్ ప్రపంచంలో హీరోయిన్గా ఎంటర్ అయిన తరువాత తన ఫేట్ మార్చుకోవాలని చాలా ట్రై చేసింది గీతా సింగ్. ఈ పేరు చెప్పితే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు అదే కితకితలు సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే . ఈ సినిమా అప్పట్లో జనాలను కడుపుబ్బ నవ్వించేసింది . అంతేకాదు బొద్దుగా గా ఉన్న ఆడవాళ్లు ఇబ్బందుల గురించి వాళ్ల మనస్తత్వం గురించి క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చింది.
గీత సింగ్ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించింది . కొన్ని మనసుకు హత్తుకునే పాత్రలు అయితే కొన్ని మనుషులని ఆలోచింపజేసే పాత్రలో నటించింది. మరి ముఖ్యంగా గీతా సింగ్ కెరియర్ లో చెప్పుకోతగా హిట్ పడిన సినిమా అంటే మాత్రం కితకితలు అని చెప్పాలి. ఆ తర్వాత బోలెడు సినిమాలో నటించినా కేవలం గీత సింగ్ పాత్ర ఉంది అంటే ఉంది అన్నట్లు ఉంది. అయితే పైకి ఎప్పుడు నవ్వుతూ కనిపించే గీతా సింగ్ కెరియర్ లో ఎన్నో విషాదాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఆమె తన శరీరాకృతి కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అంతేకాదు ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ కమెడియన్ వయసులో చాలా పెద్దాయన గీత సింగ్ తో తప్పుగా మాట్లాడి ఆమె మనస్సును హర్ట్ చేశారట.
ఓ సినిమా షూటింగ్లో భాగంగా సరదాగా గడుపుతున్న వీళ్ళు గీతా సింగ్ ను బెడ్ పై పడుకోమని చెప్పి “చూడు ఈ బెడ్ పై నువ్వే సరిపోయావు .. మరి నీ పార్టనర్ ఎలా పడుకోగలరు..” పెళ్లి చేసుకోకు అంటూ దారుణంగా కామెంట్ చేసాడట. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆ కామెంట్స్ అన్ని భరించి తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వస్తుంది గీతా సింగ్.చాలా సినిమాల్లో గీత సింగ్ బాడీ షేప్స్ పై పరోక్షకంగా కామెంట్ చేశారట.
ఇలాంటి లావుగా ఉన్న అమ్మాయిని కమెడియన్ గా పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ ఆమె పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట. తప్పు నాది కాదు నా హెరిడిటి ప్రాబ్లం ఇది ..ఫుడ్ తినడం వల్ల వచ్చింది కాదు అంటూ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చుకున్న జనాలు వినలేదట. ఆ తర్వాత ఇలాంటి మనుషులకి క్లారిటీ ఇవ్వడం వేస్ట్ అని వదిలేసిందట . అనే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు నా లైఫ్ నా ఇష్టం అంటూ తనకు నచ్చినట్లు బ్రతకడానికి ట్రై చేస్తుందట.