టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అప్పుల్లో కూరుకుపోయిందా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అదేంటి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కదా.. ఆ డబ్బులు అంతా ఏం చేసిందా అంటూ అనుకుంటున్నారా.. ఎన్ని కోట్లు తీసుకున్న దానికి తగ్గ ఖర్చులు చేస్తుంటే కొండైనా కరగదా ..!! అలాగే సమంత దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయట. ఈ క్రమంలోని సమంత తన నెక్స్ట్ సినిమాల కోసం హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది .
అంతేకాదు సమంత ఇన్నాళ్ళ తన కెరీర్లో సంపాదించింది అంతా సగానికి సగం మెకప్ లకే తగలేసిందట. మరీ ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్న తర్వాత తన ఖర్చులను తానే భరించడం.. అడిగిన వాళ్ళకి లేదు అనకుండా సహాయం చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
నిజానికి సమంత-నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు సమంత మేకప్ ఖర్చులు, టూర్ ఖర్చులు మొత్తం అక్కినేని ఫ్యామిలీనే భరిచ్చిందట . కాగా విడాకులు తీసుకున్న తర్వాత సమంత జాలీ జాలీగా తిరుగుతుంది . ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న ఏమి కొనుక్కోవాలన్న ఏ బిజినెస్ లు పెట్టుబడులు పట్టాలన్న మొత్తం సమంత సంపాదించిన రూపాయితోనే జరగాలి ..ఈ క్రమంలోనే సమంత అందరిని గుడ్డిగా నమ్మి అప్పులు ఎక్కువగా ఇచ్చిందట. దీంతోనే అప్పులు ఇచ్చిన సమంతనే అప్పుల పాలు అయిందని ఓ న్యూస్ ఫైనల్ గా మారింది .