రఘువరన్ అంటే ఈ తరం సినీ లవర్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. అదే 1990వ దశకంలో రఘువరన్ విలనిజంకు పిచ్చ క్రేజ్ ఉండేది. నాగార్జున కెరీర్ టర్న్ చేసిన శివ సినిమాలో రఘువరన్ విలన్ పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో తెలిసిందే. అప్పట్లో విలన్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారన్నది రఘువరన్ ఫ్రూవ్ చేసి చూపించాడు. శివ, పసివాడి ప్రాణం, బాషా సినిమాల్లో రఘువరన్ విలన్ పాత్రలు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి.
రఘువరన్ స్వస్థలం కేరళ రాష్ట్రం. పాలక్కాడ్ జిల్లాలోని కోలెంగూడెంలో వేలాయుధన్, కస్తూరి దంపతులకు రఘువరన్ జన్మించాడు. రఘువరన్ మళయాళీ అయినా కూడా ఎక్కువుగా తెలుగు, తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. అచ్చ తెలుగు అమ్మాయి, అనకాపల్లి ఆడపడుచు రోహిణితో ఆయనకు పెళ్లి అయ్యింది. నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్న వయస్సులోనే రఘువరన్ స్టైల్‌కు ఆకర్షితురాలు అయిన ఆమె అతడితో ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవడం జరిగింది.
ఈ దంపతులకు ఓ బాబు కూడా జన్మించాడు. సాయి రిషివరన్ అనే కుమారుడు పుట్టాక రఘువరన్ విపరీతంగా మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిస అయిపోయాడు. కేవలం ఈ అలవాటు వల్లే రఘువరన్ సినీ కెరీర్ నాశనం అయిపోయింది. అయితే హీరోయిన్ అమలను రఘువరన్ పిచ్చిగా ప్రేమించాడని… ఇది వన్ సైడ్ లవ్ అని.. అయితే అమల మాత్రం నాగార్జునతో ప్రేమలో పడడంతోనే రఘు వన్ సైడ్ లవ్ ఫెయిల్ అయ్యిందన్న టాక్ ఉంది.
ఆ తర్వాత రఘు పూర్తిగా మందు, మాదక ద్రవ్యాలకు బానిస అవ్వడంతో భార్య రోషిణి కూడా విసిగిపోయి విడాకులు ఇచ్చేసింది. చివరకు ఆరోగ్యం దెబ్బతినడంతో రఘువరన్ మార్చి 19, 2008 న చెన్నైలో గాఢ నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. దీర్ఘకాలం మద్యం సేవించడంతో లివర్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. విడాకులు ఇచ్చినా కూడా రోషిణి రఘువరన్ మృతి చెందాడన్న విషయం తెలుసుకుని మృతదేహంపై పడి భోరున ఏడ్చేసింది.