ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం ఎంత కామన్ గా మారిపోయిందో మనకు తెలిసిందే. బిగ్ బిగ్ స్టార్స్ అందరూ ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకుంటూ అభిమానుల గుండెలు బద్దలు కొడుతున్నారు . మరీ ముఖ్యంగా యంగ్ కపుల్స్ తో పోటీ పడుతూ పెళ్లై చాలా సంవత్సరాలు గడిచిన హీరో హీరోయిన్స్ విడాకులు తీసుకుంటూ అభిమానులను షాకింగ్ గురి చేస్తున్నారు. కాగా టాలీవుడ్ లో నాగచైతన్య-సమంత విడాకులు ఎంత ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
విజయ్ ఆంటోని పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . అంతే కాదు మరి ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ స్టైల్ అంటే తెలుగు ప్రజలకు చాలా ఇష్టం. కాగా ఈయన తాజాగా నటించిన చిత్రం హత్య. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా సోషల్ మీడియాకి ఎప్పుడు దూరంగా ఉండే విజయ్ ఆంటోని.. రీసెంట్ గా పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఆయన త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అన్నట్లు
తెలుస్తుంది.
రీసెంట్గా విజయ్ ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టుకోవచ్చాడు . ఆ పోస్టులో..” కుటుంబంలో విభేదాలు వస్తే పరిష్కరించుకోవాలి.. కానీ మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు. మనం బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ కుటుంబంలో సమస్య వస్తే మీరే పరిష్కరించుకోండి. ఒకవేళ భార్యాభర్తలు మీరు పరిష్కరించుకో లేకపోతే ఇల్లు వదిలి దూరంగా బ్రతకండి.. అంతే కానీ మూడో వ్యక్తిని మధ్యలోకి పిలవకండి . మనం బాధపడుతుంటే మన నాశనాన్ని చూసి ఆనందిస్తారు. అలాంటి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పోస్ట్ వైరల్ గా మారింది. దీన్ని బట్టి విజయ్ కి తన భార్య ఫాతిమాకు మధ్య విభేదాలు ఉన్నాయని.. ఎవరు మూడో వ్యక్తి వాళ్ళని విడగొట్టాలని చూస్తున్నారని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . మరి చూడాలి విజయ్ ఈ ట్వీట్ దేని గురించి పెట్టాడో.. ఈ విడాకులు మేటర్ కి చెక్ పెట్టాలంటే ఆయన నోరు విప్పాల్సిందే..?
உங்க குடும்பத்துல எதாவது பிரச்சனன்னா, முடிச்ச வரைக்கும் உங்களுக்குள்ள அடிச்சிக்கங்க, இல்ல விட்டு விலகிடுங்க, இல்ல கைல கால்ல விழுந்து சமாதானம் பண்ணி சேர்ந்து வாழுங்க🤝
அடுத்தவன மட்டும் கூப்புடாதிங்க🎤🫵📺
கும்மி அடிச்சி, கதைய முடிச்சிருவாங்க🔴— vijayantony (@vijayantony) October 11, 2022