ప్రియా ఆనంద్ తెలుగులో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా లీడర్. దీనికంటే ముందు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించింది. వామనన్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా పర్ఫార్మెన్స్ చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల లీడర్ సినిమాలో ఓ హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇదే సినిమాలో మరో హీరోయిన్గా రీచా గంగోపాధ్యాయ నటించింది.
రానా దగ్గుబాటి హీరోగా పరిచయమైన ఈ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. అయినా కూడా ప్రియా ఆనంద్, రీచా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా నటించి కొన్నేళ్ళు బాగా తెరపై కనిపించి అలరించారు. ముఖ్యంగా ప్రియా ఆనంద్ తెలుగుతో పాటుగా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. హిందీలో ఫూక్రే, రంగ్రేజ్, ఫూక్రే రిటర్న్స్, ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
అయితే, ఏ హీరోయిన్‌కైనా కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడటం చలా కష్టం. అలా తట్టుకొని నిలబడితే మాత్రం ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని కొన్నేళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగగలరు. ఇక్కడ ప్రియా ఆనంద్ కూడా తన మొదటి సినిమా లీడర్ సమయంలో కాస్టింగ్ కౌచ్ పరంగా బాగానే ఇబ్బందులు ఎదుర్కున్నట్టుగా అప్పట్లో మాట్లాడుకున్నారు.
లీడర్ షూటింగ్ చాలా ఆలస్యంగా సాగింది. చెన్నై లో ఉండే ప్రియా ఆనంద్ ఈ మూవీ షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చేది. అయితే, షూటింగ్ లేకపోయినా కూడా 10, 15 రోజులు గెస్ట్ హౌస్‌లో ఉంచి ఎవరో ఒకరు వెళ్ళి ఇబ్బంది పెట్టారట. అక్కడ సన్నిహితంగా ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఈ విషయాలను చెప్పి నన్ను పంపించేయండీ అంటూ గోడు వెళ్ళబుచ్చేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది.
మెరనేజర్ దగ్గర్నుంచి అవకాశం ఉన్న ప్రతీ ఒక్కడూ తనని ఇబ్బంది పెట్టాలని చూసినట్టుగా ఆమె సన్నిహితులతో చెప్పుకుని వాపోయిందని సమాచారం. మొదటి సినిమా కాబట్టి అన్నీ భరిస్తూ నెట్టుకొచ్చింది. ఆ తర్వాత మాత్రం కాస్త పాపులర్ అయ్యాక సాఫీగా సాగిందట. ఏదేమైనా హీరోయిన్ అంటే ఇలాంటి ఇబ్బందులు తట్టుకొని నెటుకురావాలి. లేదంటే కనుమరుగైపోతారు.