ఆచార్య పరాజయానికి కారణాలు ఏవైనా చిరంజీవి మాత్రం పదే పదే కొరటాల శివే కారణమంటూ పరోక్షంగా, ప్రత్యక్షంగా చేస్తోన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఓ సినిమా ప్లాప్ అయ్యాక అంత పెద్ద హీరో దాని గురించి వదిలేసి తర్వాత సినిమాలపై కాన్‌సంట్రేషన్ చేయాలి. అయితే చిరు మాత్రం పదే పదే ఆచార్య ప్లాప్‌కు కొరటాలే కారణమంటూ సెటైర్లు పేలుస్తూనే వస్తున్నారు. ప్లాప్‌నకు కారణం కొరటాలే అన్నట్టు మాట్లాడుతున్నారు.
మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో ఆచార్య పరాజయంపై అన్ని సార్లు మాట్లాడి ఉండకూడదు. ఈ సినిమా అందరికి భారీ నష్టాలు మిగిల్చింది. చిరు కెరీర్‌లో ఎన్నో హిట్లతో పాటు డిజాస్టర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ఈ సినిమా ప్లాపే ఆయన్ను ఎందుకు ఎక్కువుగా బాధపెడుతోందంటే ఈ సినిమాలో తొలిసారిగా చిరు, చెర్రీ కలిసి నటించారు. ఇదే విషయమై చిరు మాట్లాడుతూ మరోసారి తాను, చెర్రీ కలిసి నటించినా అంత క్రేజ్, హైప్ ఉండదని చెప్పారు.
ఇక చిరు ఇప్పటికే మూడు నాలుగు సార్లు కొరటాలపైకి ఆచార్య ప్లాప్ బాధ్యత నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చిరు తనను టార్గెట్ చేయడంతో విసిగిపోయిన కొరటాల ఇప్పుడు చిరుపై తీవ్రంగానే తన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆచార్య ప్లాప్ బాధ్యత అంతా చిరుదే అని కొరటాల సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది.
కొరటాల సౌమ్యుడు.. కాంట్రవర్సీలకు పోయేందుకు ఇష్టపడరు. ఆచార్యకు ముందు వరకు కొరటాల డైరెక్ట్ చేసినవి అన్నీ హిట్లే. పైగా కొరటాలకు పోసాని కృష్ణమురళీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అదే ఈ పాటికి కొరటాలను ఎవరైనా కామెంట్ చేసి ఉంటే పోసాని లైన్లోకి వచ్చి వాళ్లను వాయించేసేవాడు. చిరుయే స్వయంగా కొరటాలను పదే పదే అంటున్నా పోసాని కూడా ఏం చేయలేని పరిస్థితి.
వాస్తవంగా చిరు సినిమాలో కథలో వేలు పెట్టి కెలికేయడంతోనే ఆచార్య ఇంత డిజాస్టర్ అయ్యిందని కొరటాల టీం చెపుతోన్న మాట. చివరకు రేపు షూటింగ్ ఉందనగా.. ఈ రోజు కూడా చాలా సీన్లు మార్చిన సందర్భాలు ఉన్నాయని వారు చెపుతున్నారట. ముందుగా కాజల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె తప్పుకునే సరికి కథను ఇష్టానుసారం మార్చేశారు. తర్వాత పూజాహెగ్డేను తీసుకువచ్చారు.
చెర్రీ క్యారెక్టర్ 15 నిమిషాలు ఉంటే దానిని సెకండాఫ్‌లో బాగా సాగదీసేశారు. ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టుగా ఆచార్య ప్లాప్ వెనక చాలా కారణాలే ఉన్నాయి. అందులో చిరు స్వయంకృతాపరాథంతో పాటు ఆయన కథలో మార్పులు చేర్పులు చేయడం కూడా ఓ తప్పే. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మొత్తం తప్పంతా కొరటాల చేశాడన్నట్టుగా మాట్లాడడం ఎవ్వరికి నచ్చడం లేదు. అందుకే కొరటాల కూడా చిరుపై పైకి విమర్శలు చేయకపోయినా ఇన్నర్‌గా ఆగ్రహంతోనే ఉన్నాడట.