జ్యోతిలక్ష్మి చేయడమే ఛార్మీ కెరీర్ సంకనాకిపోవడానికి కారణమా..? ఇటీవల లైగర్ సినిమా డిజాస్టర్ కారణంగా మళ్ళీ పూరీతో పాటు ఛార్మీ బాగా హైలెట్ అయింది. హీరోయిన్స్ నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్నవారే. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహానటి సావిత్రి గారే దీనికి పెద్ద ఉదాహరణ. హీరోయిన్స్‌గా సినిమాలు చేసి సక్సెస్ చూసిన వాళ్ళు ఇంకో ఆలోచన లేకపోతే బావుంటుందని అందరూ చెబుతుంటారు. కానీ, ఆ తరం హీరోయిన్స్ దగ్గర్నుంచీ ఈ తరం హీరోయిన్స్ వరకూ చాలామంది వ్యాపారం చేస్తున్నవారే.
నాలుగు సినిమాలు భారీ హిట్ సాధించి కాస్త డబ్బు పోగైతే చాలు ఏ ఫిట్‌నెస్ సెంటరో, ఏ హోటల్ బిజినెసో మెల్లగా మొదలెట్టేస్తున్నారు. సమంత మింత్ర అంటూ బట్టల వ్యాపారం మొదలుపెట్టింది. ఇది సక్సెస్ అయింది. రకుల్ ప్రీత్‌సింగ్‌కి హైదరాబాద్, బెంగుళూరు సహా పలు ప్రాంతాలలో ఫిట్‌నెస్ సెంటర్స్ ఉన్నాయి. కొందరు హోటల్ బిజినెస్‌లో సెటిలయ్యారు. కొందరు హీరోలు ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లో సెటిలవుతున్నారు.
అయితే, ఇతర వ్యాపారాలు బాగానే కలిసొచ్చినప్పటికీ నిర్మాణ రంగం మాత్రం నూటికి తొంబై శాతం హీరోయిన్స్‌కి కలిసి రాదు. ఇందులో దిగితే అగాధంలో పడి అప్పులపాలై కోలుకోలేకపోతారు. కానీ, ఇది గ్రహించడానికి పుష్కరకాలం పడుతుంది. అంతా అర్థమయ్యేలోగా అన్నీ పోగొట్టుకొని రోడ్డుమీదకి వచ్చేస్తారు. ఛార్మీ పరిస్థితి కూడా ఇప్పుడు అదే అంటున్నారు. జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఒక పెద్ద మైనస్ అయితే, ఆ సినిమాతో నిర్మాతగా మారడం మరో పెద్ద మైనస్.
జ్యోతిలక్ష్మీ సినిమాతో పూరి కనెక్ట్స్ స్థాపించి పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సంస్థలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది అంటే ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపే. అదే ఛార్మీ కెరీర్‌ని అన్ని రకాలుగా దెబ్బ తీస్తుందని ఇంతకాలం మాట్లాడుకుంటూ వచ్చారు. జ్యోతిలక్ష్మి సినిమాకు ముందు వరకు ఛార్మీ కాస్త ట్రాక్‌లోనే ఉండేది.
పూరి మాట నమ్మి ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం ఒక మైనస్ అయితే… ఆ సినిమాతో నిర్మాతగా మారడం కూడా ఆమె కెరీర్‌ను ట్రాక్ తప్పించేసిందనే చెప్పాలి. ఇటీవల వచ్చిన లైగర్ డిజాస్టర్‌తో ఛార్మీ పనైపోయిందనే దాదాపు అందరూ డిసైడయ్యారు. లైగర్ గనక హిట్ అయితే, ఆ కథ వేరేలా ఉండేది. కానీ, పూరి – ఛార్మీల అదృష్ఠం ఏమాత్రం బాగాలేదు. అందుకే..ఛార్మీ జ్యోతిలక్ష్మీ సినిమా నుంచి అనవసరంగా రాంగ్ స్టెప్పులు వేసిందనే చెప్పాలి.