Moviesబాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన హీరో - హీరోయిన్ల ల‌వ్ ఎఫైర్లు...

బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన హీరో – హీరోయిన్ల ల‌వ్ ఎఫైర్లు ఇవే..!

ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. ఈ రంగుల ప్ర‌పంచంలో ఎఫైర్లు అనేవి కామ‌న్‌. ఈ ఎఫైర్లు హీరో, హీరోయిన్ల మ‌ధ్య‌, హీరోయిన్లు, ద‌ర్శ‌కుల మ‌ధ్య‌లో ఎలాగైనా ఉండొచ్చు. ఇక బాలీవుడ్‌లో ఎఫైర్లు చాలా కామ‌న్. ఒక‌ప్పుడు బాలీవుడ్‌తో పాటు నేష‌న‌ల్ మీడియాను ఊపేసిన‌.. ఇప్ప‌ట‌కీ ఊపుతున్న ఎఫైర్లు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే పెళ్లైన హీరోలు, హీరోయిన్లు కూడా ఎఫైర్లు పెట్టుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఆ ఎఫైర్లు… ఆ హీరో, హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

మిథున్‌ చక్రవర్తి – శ్రీదేవి :
సౌత్ ఇండియాను త‌న అంద‌చందాల‌తో ఊపేసిన శ్రీదేవిని ఆ త‌ర్వాత ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు బాలీవుడ్‌కు తీసుకువెళ్లారు. అప్ప‌టికే మిథున్‌కు యోగితాబాలితో పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్నారు. అయినా కూడా ఆయన శ్రీదేవి ఎఫైర్ పెట్టుకుని స‌హ‌జీవ‌నం చేశారు. అయితే యోగితా బాలి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించ‌డంతో శ్రీదేవికి దూర‌మైయ్యాడు. ఆ త‌ర్వాత శ్రీదేవి మ‌ళ్లీ రాంగ్ స్టెప్ వేసి అప్పటికే పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్న బోనీక‌పూర్‌ను పెళ్లాడింది.

ప్రియాంక చోప్రా – షారుఖ్ ఖాన్ :
షారుక్ ఖాన్ ఎఫైర్లు చాలానే ఉన్నాయి. భార్య గౌరీతో పెళ్ల‌య్యాక కూడా కాజ‌ల్‌తో స‌న్నిహిత బంధం ఏర్ప‌డింది. కాజ‌ల్ – షారుక్ కాంబోలో ఎన్నో సూప‌ర్ హిట్లు రావ‌డంతో పాటు వీరి కాంబినేష‌న్‌కు మంచి కాంబినేష‌న్ అన్న పేరుంది. దీంతో కాజల్‌, షారుక్ బంధం చాలా రోజులు న‌డిచింది. ఆ త‌ర్వాత ప్రియాంక చోప్రాతో కూడా మ‌నోడు ఎఫైర్ పెట్టుకున్నాడ‌ని టాక్ ?

ప్రియాంక చోప్రా – అక్షయ్ కుమార్ :
ప్రియాంక షారుక్ త‌ర్వాత అక్ష‌య్‌కుమార్‌తో కూడా ఎఫైర్ పెట్టుకున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. వాస్త‌వంగా చూస్తే అక్ష‌య్‌కుమ‌ర్ మంచి రొమాంటిక్ హీరో. చాలా మంది హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపాడు. ముందుగా ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అందాల నాటి రేఖ‌.. ఆ త‌ర్వాత శిల్పాశెట్టి, ర‌వీనా టాండ‌న్‌తో ఎంజాయ్ చేశాడు. ఈ కోవ‌లోనే ప్రియాంక‌తో కూడా కొన్ని రోజులు క‌థ న‌డిపాడ‌ని అంటారు.

అమీర్ ఖాన్ – ఫాతిమా షేక్ :
అమీర్ ఖాన్ తన రెండో భార్య కిర‌ణ్‌రావ్‌తో విడిపోక ముందే దంగ‌ల్ ఫేం ఫాతిమా స‌నాషేక్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. ఆమె వ‌ల్లే కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చాడ‌ని అంటారు.

అజయ్ దేవగన్ – కంగనా రనౌత్ :
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌, కంగ‌నా ర‌నౌత్ కూడా ఎఫైర్ పెట్టుకున్నార‌ని అప్ప‌ట్లో బాలీవుడ్ మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది. ఆ త‌ర్వాత ఆమె హృతిక్ రోష‌న్‌తో స‌హ‌జీవ‌నం చేసింద‌ని అంటారు. హృతిక్‌తోనూ కంగ‌నాకు చెడ‌డం వ‌ల్లే అత‌డిని ఇప్ప‌ట‌కి ఓ ఆటాడుకుంటూ ఉంటోంది.

మలైకా అరోరా – అర్జున్ కపూర్ :
మలైకా అరోరా ముందుగా బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. 18 ఏళ్ల కాపురం.. ఓ బాబు పుట్టాక కూడా భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. త‌న‌కంటే వ‌య‌స్సులో 10 ఏళ్ల‌కు పైగా చిన్నోడు అయిన అర్జున్‌తో ఎఫైర్ న‌డుపుతున్న విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో మ‌లైకాను వ‌దిలించుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news