అవును.. తెలుగు భాష తెలియని వారు సైతం.. అన్నగారి సినిమాలు చూసి.. మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివాటిలో కీలకమైంది.. దానవీర శూరకర్ణ. ఈ సినిమా బహుముఖ రీతుల్లో ఉంటుంది. 3 పాత్రల్లో అన్నగారే నటించారు. కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి కీలక రోల్స్ లో అన్నగారే నటించారు. దీంతో సినిమాకు ఎనలేని ప్రచారం వచ్చింది. పైగా ఈ సినిమాకు తొలిసారి.. అన్నగారు.. తిరుపతి వెంకట కవులతో డైలాగులు రాయించారు. నిజానికి వెంకట కవులు అంటే.. కేవలం భగవత్ సంబంధమైన వ్యవహారాలకే పరిమితం అయ్యేవారు.
కానీ, గేయ రచయిత నారాయణ రెడ్డిగారు.. సూచించడంతో అన్నగారు తిరుపతి వెంకట కవులతో సంభాషణలు రాయించారు. అదేవిధంగా.. ఇతర ఎఫెక్ట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు జోరుగా సాగాయి. రిలీజ్ అయ్యాక కర్ణ తెలుగునాట సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంత పేరు తెచ్చుకున్న సినిమాపై హిందీ బెల్ట్‌లోనూ ఆసక్తి రేగింది.
ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ వంటివారు ఎంతో ఆసక్తిగా.. ఈ సినిమాపై చర్చించేవారు. ఇలా.. ఈసినిమాను తొలిసారి.. బొంబాయి థియేటర్‌లో వేశారు. ఆ సినిమాకు వచ్చిన.. ప్రముఖ నిర్మాత.. దీనిని హిందీలో తీయాలని అనుకున్నారు. ఎందుకంటే.. రామాయణ,మహాభారత గాధలకు.. తెలుగులో ఎంతటి ఆదరణ ఉందో.. హిందీలోనూ.. అంతే ఈక్వేషన్ ఉంది. దీనిని గమనించిన.. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. దీనికి.. అన్నగారే అడ్డు పడ్డారని అంటున్నారు.
ఎందుకంటే.. హిందీ బెల్ట్‌లో తిరుపతి వెంకట కవులు లేరనేది అన్నగారి భావన. వారైతేనే సినిమాకు న్యాయం చేయగలరని అన్నగారు.. నమ్మారు. సో.. ఈ సినిమాను యథాతథంగా తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారు తప్ప.. డైలాగులు మార్చే విధానంలో నిర్మాతకు వదిలి పెట్టారు. మొత్తానికి ఈ సినిమా.. హిందీలో వచ్చినా.. కీలకమైన డైలాగులకు కత్తెర వేయడం గమనార్హం. అయితే.. భాష రాని వారు కూడా ఈ సినిమాను ఆదరించడం గమనార్హం.