Movies"చంప పగిలిపోద్ది"..పూజా హెగ్డే కు బిగ్ వార్నింగ్.. ఏమైందంటే..!?

“చంప పగిలిపోద్ది”..పూజా హెగ్డే కు బిగ్ వార్నింగ్.. ఏమైందంటే..!?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కెరియర్ మొదట్లో సినిమాలు హిట్ కొట్టడానికి చాలా కష్టపడ్డ ఈ బ్యూటీ ..ఆ తర్వాత “దువ్వాడ జగన్నాథం” సినిమాతో కెరియర్ లోని ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో “అరవింద వీరరాఘవ సమేత ” అంటూ సెకండ్ హిట్ను కూడా బ్లాక్ బస్టర్ హిట్గా మలుచుకునింది. ఈ రెండు సినిమాలు హిట్ అవడం తో.. అమ్మడు ఖాతాలో వరుసగా బిగ్ ఆఫర్స్ వచ్చి పడ్డాయి. దీంతో పూజా హెగ్డే కెరియర్ ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

కాగా గత కొన్ని రోజుల నుంచి పూజ హెగ్డేను మళ్ళీ ఐరన్ లెగ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె లాస్ట్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే. కోలీవుడ్ హీరో విజయ్ తో నటించిన ” బీస్ట్” సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అంతకు ముందు వచ్చిన ప్రభాస్ సినిమా “రాధేశ్యామ్” కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆశలన్నీ మూడో సినిమాపై పెట్టుకుని ఆచార్యతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పరమ చెత్త టాక్ ని సంపాదించుకుంది . దీంతో మూడు సినిమాలు ఫ్లాప్ అయిన పూజా హెగ్డే కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ట్రోలర్స్ మళ్లీ ఆమెను ఐరన్ లెగ్ అంటూ ఓ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే పూజ హెగ్డే కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి ఆఫర్లు కూడా వచ్చినట్టే వచ్చే చేజారిపోతున్నాయి. కాగా రీసెంట్ గా పూజా హెగ్డే సినిమాలో అవకాశాల కోసం చెత్త పనులు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఐరన్ లెగ్ అనే ముద్ర పోగొట్టుకోవడానికి సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడానికి పూజా హెగ్డే పెళ్లైన బాలీవుడ్ బడా హీరోతో ఈ మధ్యకాలం ఎక్కువగా రాసుకుని పూసుకుని తిరుగుతుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇదివరకే మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై రీసెంట్ గా పూజా హెగ్డే అమ్మగారు ఆమెకు వార్నింగ్ ఇచ్చిందట .

“నిజంగానే నువ్వు అలాంటి చెత్త పనులు చేయడానికి సిద్ధపడినట్లయితే ..చెంప పగిలిపోద్ది.. సినిమాలు వద్దు ఏమి వద్దు మానేసేయ్” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. దీంతో పూజ హెగ్డే “అలాంటిదేమీ లేదు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తిరుగుతున్నామంటూ క్లారిటీ ఇచ్చిందట”. అయినా కానీ పూజా హెగ్డే వాళ్ళ అమ్మగారు నమ్మట్లేదు అని తెలుస్తుంది. దీంతో పూజ హెగ్డే కు ఆ బాలీవుడ్ బడా హీరోకు మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news