గత మూడు నాలుగు సంవత్సరాలుగా భారత దేశ సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు చాలా సింపుల్‌గా విడాకులు తీసేసుకుంటున్నారు. కొన్నేళ్లపాటు ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకటైన జంటలు కూడా పడిపోతున్నాయి. కొన్ని జంటలు విడాకులు తీసుకోవడం మరి షాకింగ్ గా ఉంది. నాగచైతన్య – సమంత అటు ధనుష్ దంపతులు, అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మరో బాలీవుడ్ క్యూట్ కఫుల్ కూడా విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
బాలీవుడ్ లోనే క్యూట్ కపుల్‌గా పేరన్న దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ కొన్నేళ్లపాటు ప్రేమించుకుని 2018లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఏ అవార్డుల ఫంక్షన్ లో చూసినా… సినిమా ప్రమోషన్లలో చూసినా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అసలు వీరిద్దరి ఫెయిర్ చూసి చాలామంది తమ జంట కూడా ఇలాగే ఉండాలని ఆశపడేవారు. అలాంటి జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు అన్న టాక్ మీడియాలో వినిపిస్తోంది.
కారణం ఏంటన్నది పూర్తిగా తెలియదు కానీ… రణవీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ బాగా వైరల్ అయ్యాక వీరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. దీనికి తోడు దుబాయ్ ఫిల్మిక్రిటిక్ ఉమైర్ సంధు కూడా దీపిక – రణవీర్ బంధం చెడిపోయిందని… త్వరలోనే వారి విడాకుల ప్రకటన రాబోతుందంటూ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై దీపికా – రణవీర్ ఎవరు స్పందించలేదు. దీంతో వీరి అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
రీసెంట్గా రణబీర్ మాట్లాడుతూ 2012లో దీపికతో తనకు పరిచయం అయిందని ఈ 10 ఏళ్లలో తనపై ఇంకా ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదని… ఆమె తన లైఫ్ లోకి వచ్చాక తన జీవితం మరింత అందంగా మారిందని చెప్పాడు. అయితే శుక్రవారం ఉదయం దీపిక తన తల్లి ఉజ్జల పదుకొనేతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఈ వీడియోలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేదు. దీంతో నిటిజన్లు దీపిక వెడ్డింగ్ రింగ్ తీసేసింది అంటే వీరిద్దరి విడాకులు నిజమేనా ? అన్న కొత్త సందేహాలకు తెరలేపారు. ఏదేమైనా వీరిద్దరూ కలిసి క్లారిటీ ఇచ్చేవరకు ఈ విడాకుల వార్తలు ఆగేలా లేవు. మరి ఇందులో నిజా నిజాలు ఎంతో వారిద్దరికే తెలియాలి.