Moviesపూరికి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..ఒక్క ఫోటో తో గుట్టు రట్టు..!?

పూరికి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..ఒక్క ఫోటో తో గుట్టు రట్టు..!?

బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మారిపోతాడో.. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతాడో ..ఎవరికీ అర్థం కాదు .కనీసం ఆయన ఆలోచించి మాట్లాడతారో లేదో ఆయనకే తెలియదు అంటుంటారు జనాలు . దానికి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి . మరీ ముఖ్యంగా రీసెంట్ కాలంలో బండ్ల గణేష్ కు పూరి జగన్నాథ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అనేంతలా వార్ జరుగుతుంది .

పైకి మాత్రం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు ..కానీ ట్విట్టర్లో మాత్రం ఓ రేంజ్ లో మాటలు యుద్ధం జరుగుతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా పూరి కొడుకు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లీ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు లైగర్ ప్లాప్ అయిన తరుణంలోనూ బండ్ల గణేష్ మాటలు వైరల్ గా మారాయి .

కాగా రీసెంట్గా పూరి జగన్నాథ్ ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే. ఆయనకు ప్రాణహాని ఉంది అంటూ ఏకంగా సోషల్ మీడియా ద్వారానే చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్గా పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా..” నేను ఎప్పుడు ఎవ్వరిని మోసం చేయలేదని.. దగా చేస్తే అది నన్ను నమ్మి సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ నే అని..వాళ్లను తప్పిస్తే మిగతా ఎవ్వరిని నేను మోసం చేయలేదు. నేను మోసం చేసిన జనాలను కచ్చితంగా ఎంటర్టైన్ చేసే విధంగా..మళ్ళీ సినిమా తీస్తా అంటూ” ఓ పోస్ట్ పెట్టుకోచ్చాడు. ఈ ట్వీట్ ను మళ్ళీ పోస్ట్ చేస్తూ..పూరి ఫ్యామిలీ ఫోటోని పోస్ట్ చేసాడు బండ్ల గణేష్. దీంతో పరోక్షకంగా “నీ ఫ్యామిలీని నువ్వు మోసం చేసావ్” అనే విషంగా బండ్ల ట్వీట్ ఉందంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news