ఏఎన్ఆర్.. అక్కినేని నాగేశ్వరరావు ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీను తన నటనతో ఏలేసిన వన్ ఆఫ్ ది టాప్ హీరో. అక్కినేని అనే ఇంటి పేరుకు ఇంతటి క్రేజ్ రావడానికి ముఖ్య కారణం నాగేశ్వరరావు అని చెప్పాలి . అలాంటి ఓ చెరగని స్థాయిని ..ఆయన అక్కినేని అనే పేరుకు సంపాదించి పెట్టారు. ఇప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్తే కన్నీరు పెట్టుకునే జనాలు చాలామంది ఉన్నారు . ఆయన మంచితనం ..ఆయన నటన ..ఆయన పద్ధతులు.. నచ్చిన జనాలు బోలెడు మంది.
సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటారు . అందులో వన్ ఆఫ్ ది మెయిన్ హీరో ఏఎన్నార్ . పద్ధతికి మరో మారుపేరు అంటూ ఏఎన్ఆర్ కి ముద్దు పేరు కూడా ఉంది. అయితే ఏఎన్ఆర్ తన లాస్ట్ రోజుల్లో ఫ్యామిలీలో గొడవలతో చాలా బాధపడ్డారట . మరీ ముఖ్యంగా అమల-నాగార్జున-నాగచైతన్య ముగ్గురు మధ్య ఉన్న గొడవలు కారణంగా ఏఎన్నార్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
కాగా ఏఎన్ఆర్ లాస్ట్ రోజుల్లో అమలతో ఏఎన్ఆర్ కు పెద్ద గొడవలు జరిగాయట. మరీ ముఖ్యంగా అమల హెల్త్ విషయంలో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ..అది ఏఎన్ఆర్ కి నచ్చకపోవడంతో ..ఏఎన్ఆర్ చాలా బాధపడ్డారట . మనకు తెలిసిందే.. ఈ కాలం ఫుడ్.. ఒకప్పటికి ఫుడ్ చాలా తేడా ఉంటుంది. ఈ ఫుడ్ విషయంలోనే అమల కి నాగేశ్వర రావుకి గొడవలు అయ్యేవట. విసిగెత్తిపోయిన నాగార్జున.. ఈ కారణంగా అమలకు కొద్దిరోజులు దూరంగా కూడా ఉన్నాడట.
“ఈ క్రమంలోనే అమల నీకు ఇష్టం లేని నన్ను నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడనే గా మమ్మల్ని విడదీస్తున్నావ్” అంటూ కన్నీరు పెట్టుకుందట. ఆ మాటతో బాధపడిపోయిన నాగేశ్వర రావు కన్నీళ్లు పెట్టుకున్నాడట . అప్పటినుంచి ఏఎన్ఆర్ ..అమల నాగార్జునతో ఎక్కువగా మాట్లాడలేదట. తన పని తాను చూసుకుంటూ ఉండేవారని సినీ వర్గాల ప్రముఖులు చెప్పుకొచ్చారు. అయితే అలా జరిగిన కొన్ని నెలలకే ఆయన ఈ లోకాని విడిచారు . ఆ టైంలో నాగార్జున వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.