సినిమా ఇండస్ట్రీలో అనేకమంది నటీనటులు తమ తోటి నటులతో స్నేహంగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి స్నేహితులుగా కొంతమంది ఉంటే వచ్చాక.. కొందరు స్నేహితులుగా మారుతారు. ఇకొందరు తమ తోటి హీరోయిన్స్ ఎక్కడ వారికి పోటీ అవుతారో అని భావించి దగ్గరకు కూడా రానివ్వరు. అయితే మనం ఇప్పుడు చెప్పకోబోయే ఇద్దరు హీరోయిన్లు నార్త్‌లో పుట్టి పెరిగినా సినిమా ద్వారా సౌత్ వరకు పాపులర్ అయ్యారు. మరి వీరి మధ్య ఉన్న స్నేహం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు చిన్న వయస్సులోనే స్టార్ డం తెచ్చుకుని అనూహ్యంగా మృతిచెందిన నటి దివ్య భారతి మరియు కాంట్రవర్సీయల్ హీరోయిన్ నగ్మా.
బాలీవుడ్ లో కొంత మేర వీరి మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసినా… సౌత్ లో మాత్రం వీరి బంధం గురించి ఎవరికి తెలియదు. వీరి స్నేహం ఏ రేంజ్ లో ఉండేది అంటే దివ్య భారతి తెలుగులో మొదట నటించింది. ఇక్కడ సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో అమె దగ్గరకి అనేక కథలు వచ్చేవి. కానీ అన్ని సినిమాల్లో నటించడానికి ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అయ్యేవి కావు. ఆ సినిమాల్లో ఎవరు నటించిన దివ్య భారతికి సంబందం లేదు. కానీ అందరిలా ఉంటే అమె దివ్య భారతి ఎందుకు అవుతుంది. నటించింది, జీవించింది తక్కువ రోజులే అయిన దివ్య హృదయం ఎంతో విశాలమైనది.
అందుకే తనకు పోటీ ఇస్తుందేమో అనే అనుమానం లేకుండా అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా కు తన వద్దకు వచ్చిన సినిమాల్లో అవకాశం ఇమ్మని సదరు తెలుగు సినిమా నిర్మాతలకు సజెస్ట్ చేసేది. అలా ఒక హిందీ సినిమాలో నటించిన నగ్మాకు తెలుగు ఇండస్ట్రీ లో నటించే అవకాశం వచ్చేలా చేసింది దివ్య భారతి. ఇక అక్కడ మొదలెట్టిన నగ్మా సౌత్ ఇండియాలో ఎంత పెద్ద హీరోయిన్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్వయంగా దివ్య భారతి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట పెట్టింది.
దివ్య భారతి ఒక ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ గోవిందా మీకు ఒక సినిమాలో అవకాశం ఒప్పించాడు అని వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఎంత ? అని అడగ్గా, అందుకు సమాధానంగా దివ్య ఇలా చెప్పింది. మీరు చెప్పింది నిజమే. నాకు నటుడు గోవింద ఆ సినిమాలో అవకాశం ఇప్పించాడు. గోవిందా ఎంతో మంచి వ్యక్తి. నాకు చాలా మంది హీరోలు అవకాశాలు ఇప్పించారు. అలా చేసిన ప్రతి సారి నా పైన ఒక స్టోరీ అల్లేస్తున్ననారు. కానీ నేను నగ్మాకు తెలుగు సినిమాల్లో అవకాశం ఇప్పించాను… ఈ విషయాన్ని ఎవరూ మాట్లాడటం లేదు. అంటూ దివ్య భారతి వివరించింది.