Moviesఆల్ రెడీ..బిగ్ హౌస్ లో కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కమింగ్.....

ఆల్ రెడీ..బిగ్ హౌస్ లో కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కమింగ్.. ఎవరో తెలుసా..?

రోజుకో మలుపు తిరుగుతూ మరింత రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్.. రీసెంట్గా జరిగిన ఎపిసోడ్ గురించి మనకు తెలిసిందే. ఈసారి ఎపిసోడ్లో నాగార్జున బిగ్ షాక్ ఇచ్చారు. సూర్య ని డైరెక్టుగా ఎలిమినేట్ చేస్తూ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. దీంతో ఒక్కసారిగా కీర్తి, ఇనయా బోరున ఏడ్చేసారు. అయితే ఇప్పటివరకు సూర్య ని హౌస్ నుంచి బయటికి పంపించలేదు.

దీంతో సూర్య సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు త్వరలోనే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈ క్రమంలోనే సూర్య ని ఇలా సీక్రెట్ రూమ్ లో పెట్టారని తెలుస్తుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి రెడీ అయినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న వర్షిణి మరో రెండు రోజుల్లో హౌస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుందని ..ఎంట్రీ ఇవ్వడంతోనే కంటెస్టెంట్స్ పై బిగ్ బాంబ్ పేల్చబోతుందని తెలుస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజమే అయితే హౌస్ లో మరో హాట్ బ్యూటీ అందాల ప్రదర్శనకు జనాలు సిద్ధం అవ్వచ్చు అంటున్నారు నెటిజన్స్ . అయితే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ అందుకునే అవకాశం రేవంత్, ఫైమా, శ్రీహన్ ఈ ముగ్గురికి ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి… బిగ్బాస్ సీజన్ 6 ట్రోఫీని ఎవరు అందుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news