టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ..అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీరిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమా చేశారు . ఆ టైంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించి.. చివరకు అది పెళ్లిదాకా వెళ్ళింది . అయితే ఇంట్లోని పెద్దలు కూడా ప్రేమ కి అడ్డు చెప్పకుండా పెళ్లి చేసి దీవించారు. అయితే ఎవరు ఊహించని విధంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు . అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీ సమంతకు సంబంధించిన ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు.
ఆమె వల్గర్ ఫోటో షూట్ చేసిన ..ఆమె అక్కినేని ఫ్యామిలీ పై మండిపడినా.. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించలేదు .కాగా రీసెంట్గా సమంత అరుదైన వ్యాధితో బాధపడుతుందని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ వ్యాధితో బాధపడేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. మయోసైటిస్ వచ్చినవారికి కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలిసిపోతారు. కొంత దూరం నడిస్తే ఆయాసపడతారు.. అంతే కాదు ఒక్కోసారి తెలియకుండానే కింద పడిపోతారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే ఆమె ఫ్యాన్స్ అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు వాళ్లు దేవుని ప్రార్థిస్తున్నారు. కాగా ఎవరు ఊహించిన విధంగా అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ సమంత ఆరోగ్యం పై రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది .సోషల్ మీడియా వేదికగా “గెట్ వెల్ సూన్ సామ్ ” అంటూ ఓ పోస్ట్ ని పెట్టుకోచ్చాడు.
దీంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్ట సమయంలో అక్కినేని ఫ్యామిలీ అందరికీ హెల్ప్ చేస్తుందని అందుకే ఈ విధంగా మెసేజ్ చేశారని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు నాగార్జున సైతం సమంతకు పర్సనల్గా మెసేజ్ చేశాడని.. త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే సమంత త్వరగా ఆరోగ్యంగా బయటపడాలని మళ్లీ యధావిధిగా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు .