కొద్ది రోజుల క్రితం వరకు సుకుమార్ అంటే దేవిశ్రీ.. దేవిశ్రీ అంటే సుకుమార్ అన్నట్టుగా ఉండేది. సుకుమార్ కూడా చాలా సార్లు నేను శరీరం… దేవీ నా ఆత్మ అని చెప్పాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలే కాదు… సుకుమార్ రైటింగ్ చేసిన , ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు కూడా దేవీయే మ్యూజిక్ ఇచ్చేవాడు. సుక్కు సినిమాలు అంటే దేవీ ప్రాణం పెట్టేసి మరీ మ్యూజికల్‌గా హిట్ చేసేవాడు.
అంతెందుకు సుకుమార్ రైటింగ్స్‌పై సుకుమార్ తెరవెనక అంతా తానై చేసిన కుమారి 21 ఎఫ్ సినిమా విజయానికి దేవీ మ్యూజిక్ ఎలా ? హెల్ఫ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు వీరి మధ్య గ్యాప్ మొదలైందన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా సుకుమార్ రైటింగ్స్‌లో సుకుమార్ సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా మొదలు పెట్టారు. కార్తీక్ డైరెక్టర్.
అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ సుకుమారే చేస్తున్నారు. ముందుగా మ్యూజిక్ కూడా దేవిశ్రీయే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి అంజనీష్ లోక్‌నాథ్ వచ్చి చేరాడు. కారణం ఏంటా ? అని ఆరా తీస్తే చాలా కథే నడిచిందంటున్నారు. సుకుమారే కావాలని దేవిశ్రీని పక్కన పెట్టేశాడంటున్నారు. సుక్కు సినిమాల్లో దేవిశ్రీ లేకపోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాకు దేవీ ఏకంగా రు. 4 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడట.
అయితే బడ్జెట్ కంట్రల్లో ఉంచాలని సుకుమార్ ప్లాన్. ఎందుకంటే సాయిధరమ్ హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది. మనోడి మార్కెట్ చాలా డౌన్‌గా ఉంది. అందుకే సుక్కు దేవిశ్రీని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశాడని అంటున్నారు. మరి ఫస్ట్ టైం సుక్కు దేవిని పక్కన పెట్టేశాక వచ్చే సినిమా, పాటలు ఎలా ఉంటాయో ? ఏంటో చూడాలి.