Moviesపెళ్లిలో పూర్ణ కు భర్త బిగ్ సర్ ప్రైజ్..ఎన్ని కేజీల బంగారం...

పెళ్లిలో పూర్ణ కు భర్త బిగ్ సర్ ప్రైజ్..ఎన్ని కేజీల బంగారం పెట్టారో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!!

దివాళి సందర్భంగా హీరోయిన్ పూర్ణ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించింది. మనకు తెలిసిందే హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలోకి సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ..మొదటి సినిమాతో పర్లేదు అనిపించుకుంది . ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు . దీంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ వేసి గ్యాప్ తీసుకున్న పూర్ణ ..ఆ తర్వాత ఢీ షోలో జడ్జిగా మెరిసింది . దీంతో ఒక్కసారిగా ఆమె పేరు సోషల్ మీడియాలో పాపులర్ అయింది .

ఇక ఢీ లో వచ్చిన పాపులారిటీతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం జెట్ స్పీడ్ లో తీసుకుపోయిన పూర్ణ ..అదే రేంజ్ లో పెళ్లి చేసుకొని లైఫ్ లో కూడా సెటిలైపోయింది . నిజానికి తనకు పెళ్లి ఫిక్స్ అయింది అని పూర్ణ ఎప్పుడో చెప్పింది . నిశ్చితార్థం అయ్యిందని కూడా చెప్పింది ..కానీ పెళ్లి గురించి మాత్రం ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే రీసెంట్గా పూర్ణ తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్ పిక్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. నిజానికి పూర్ణకి ఎప్పుడో పెళ్లయిపోయిందట.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నామని త్వరలోనే ఫ్రెండ్స్ కు కేరళలో బిగ్ పార్టీ ఇస్తామని చెప్పింది .

కాగా దివాళి సందర్భంగా తను భర్తతో బ్యూటిఫుల్ మూమెంట్స్ తాలూకా మ్యారేజ్ పిక్స్ లు పోస్ట్ చేసింది. ఈ క్రమంలోని ఈమె పెళ్ళికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం పూర్ణకు తన భర్త దాదాపు 1700 గ్రాముల బంగారం గిఫ్టుగా ఇచ్చారట . అంతేకాదు తనకోసం ఏకంగా ఒక లగ్జరీ హౌస్ ని తన పేరు మీద మ్యారేజ్ గిఫ్ట్ గా అందించారని తెలుస్తుంది. పూర్ణ భర్త ఎవరో కాదు దుబాయ్ బెస్ట్ ఇండియన్ వ్యాపారవేత షానిద్ ఆసిఫ్ అలీ. ఇతని పేరు మన స్టార్ సెలబ్రెటీస్ అందరికీ సుపరిచితమే .కాగా తాజాగా పెళ్లి ఫోటోలు చూసిన ఫాయ్న్స్ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అంతేకాదు పెళ్లిలో పూర్ణ చూడ చక్కగా కుందనపు బొమ్మలా ఉంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news