Moviesసినిమాల కోసం దాని వదిలేశా..ఈ హీరోయిన్ మాటలకు షాక్ అవుతున్న సినీ...

సినిమాల కోసం దాని వదిలేశా..ఈ హీరోయిన్ మాటలకు షాక్ అవుతున్న సినీ పెద్దలు..!!

సినీ ఇండస్ట్రీ చాలా విశాలమైనది ..అందుకే ఎంతోమంది హీరోయిన్స్ ఉన్న కొందరు హీరోయిన్స్ జీవితం నాశనం అయిపోతున్నా.. అవి ఏవి పట్టించుకోకుండా మరికొందరు యంగ్ హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అదరగొట్టేయాలని చించేయాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ లిస్టులోకే వస్తుంది యంగ్ బ్యూటీ సంజన ఆనంద్. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు .

వాళ్ళల్లో కొందరు హిట్ అయ్యారు కొందరు ప్లాప్ అయ్యారు. అయినా అవేమీ పట్టించుకోకుండా నేను సైతం నాలోని టాలెంట్ ని బయటపెట్టాలి అనుకుంటున్నాను అంటూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అనే మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయమైంది ఈ సంజన. ఈనెల 16న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది . అంతేకాదు నిర్మాతలకు హ్యూజ్ లాభాలు తీసుకొచ్చి సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా హిట్ అవడంతో ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లపై జనాలు ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ సంజన ఆనంద్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టి అభిమానులకు గుండె బద్దలు కొట్టింది . రీసెంట్గా ఓ ఛానల్ తో ముచుట్టించిన సంజన పర్సనల్ విషయాలు గురించి చెప్పి అభిమానులకు మరింత దగ్గరయింది . ఆమె మాట్లాడుతూ..” నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులోనే ..నా మాతృభాష కూడా కన్నడ . నేను అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండేళ్లకు పైగా జాబ్ చేశాను.

కానీ సినిమాలపై ఉండే మక్కువతో మంచి సాలరీని వదులుకొని మంచి జాబ్ ను వదులుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాను.. సినిమాల కోసం నాకు అన్నం పెట్టే జాబ్ ని కూడా వదిలేసాను . సినీ ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుంది అని అనుకుంటున్నాను ..జాబ్ వదిలేసినప్పుడు మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు .కానీ సినిమా విడుదలయ్యాక నాలో ఉన్న టాలెంట్ను చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. నాపై మీ ప్రేమలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరోయిన్ చూసి షాక్ అవుతున్నారు సినీ పెద్దలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news