Moviesబాలయ్య‌ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ త‌గ్గుతుందా..అస‌లు...

బాలయ్య‌ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ త‌గ్గుతుందా..అస‌లు వాస్త‌వం ఇదే?

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఐదారేళ్లుగా కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అదిగో పులి ఇదిగో మేక అన్న చందంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్నా.. ఇంకా అది ఇప్పటివరకు జరగలేదు. అయితే బాలయ్య మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని అది త్వరలోనే అని.. సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో నటనతో పాటు డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు చెప్పారు.

మరోవైపు మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇప్పటికే సాయి కొర్ర‌పాటి లాంటి ఒకరిద్దరు నిర్మాతలు అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే మోక్షజ్ఞ తొలి సినిమా కోసం ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే యేడాదిలో కచ్చితంగా మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంటుందని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు సినిమాల్లోకి వస్తే అదే నందమూరి వంశం నుంచి ఇప్పుడు టాప్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ తగ్గుతుందా ? అన్న చర్చలు కూడా కొందరు తెరమీదకు తీసుకువస్తున్నారు.

ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య, చంద్రబాబుతో కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం అయితే ఒక సెక్షన్ పీపుల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో బాలయ్య తనయుడు హీరో అయితే బాలయ్యతో పాటు ఆయన అభిమానులు, అభిమాన సంఘాలు అందరూ ఖ‌చ్చితంగా మోక్షజ్ఞ వైపే నిలుస్తారని అంటున్నారు. మరి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి ? జూనియర్ క్రేజ్ తగ్గుతుందా అన్న ప్రశ్న కొందరి మదిని తొలిచివేస్తోంది. అయితే సినిమా విశ్లేషకులు మాత్రం మోక్షజ్ఞ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గదని ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే బాలయ్య హీరోగా వచ్చారు. బాలయ్య సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నా ఎన్టీఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఆ తరం ప్రేక్షకులకు బాలయ్య బాగా కనెక్ట్ అయిపోయాడు. రేపు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే టీనేజ్ యువతరం ప్రేక్షకులకు మోక్షజ్ఞ అభిమాన హీరోగా ఉంటే.. మధ్య వయసు. ఆపై వ‌య‌స్సు అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆరాధ్య హీరోగా నిలుస్తాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ పెరిగిన తన వయసుకు తగ్గట్టుగా పాత్రలు ఎంచుకుంటే క్రేజ్ మరింత పెరుగుతుంది. మరో 10 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు ఖచ్చితంగా పెద్ద దిక్సూచిగా ఉంటాడని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్.. బాలయ్య ఒకేసారి సినిమాల్లో ఉన్నా ఎవరి క్రేజ్ తగ్గలేదు. రేపు మోక్షజ్ఞ..జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరుగుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గే ఛాన్సే లేదని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news