టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరవాత విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తరవాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ టాలీవుడ్ లోనే టాప్ లవ్ బర్డ్స్ లా కనిపించిన సమంత – నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ లోనే మరో హీరో కూడా హీరోయిన్ ను పెళ్లి చేసుకుని ఆ తరవాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హీరో మరెవరో కాదు నాగ్ మేనల్లుడు హీరో సుమంత్. టాలీవుడ్ లో సుమంత్ స్టార్ హీరోగా రాణించలేకపోయినా అతడికి కొంతమంది అభిమానులు ఉన్నారు.
దివంగత లెజెండ్రీ స్టార్ ఏఎన్నార్‌కు అత్యంత ఇష్టుడు అయిన మనవడు యార్లగడ్డ సుమంత్. సుమంత్ నటన మరియు సినిమాలను ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. సుమంత్ గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో సైతం నటిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మరోవైపు హీరోగా కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి రెడ్డి అర్జున్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుమంత్ సోదరి ద్వారా అతడికి కీర్తిరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమంత్ – కీర్తి రెడ్డి 2004 లో పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్ళైన రెండేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. కీర్తిరెడ్డి సుమంత్‌ను సినిమాలు వదిలేసి అమెరికా వచ్చేస్తే అక్కడ వాళ్ల ఫ్యామిలీ బిజినెస్‌లు చూసుకోవచ్చని కోరగా… సుమంత్ అందుకు నిరాకరించాడు.
చివరకు ఆ గ్యాప్ పెద్దది కావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి కూడా చేసుకుంది. ఇక సుమంత్ విడాకుల తరవాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. అయితే రీసెంట్ గా మంచు మనోజ్ రెండోపెళ్లి కి రెడీ అవుతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో సుమంత్ ఎందుకు మళ్లీ చేసుకోవడం లేదు ? అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కాగా తన రెండో పెళ్లి విషయం పై సుమత్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కీర్తిరెడ్డి తో విడాకుల తరవాత చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. పెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకుంటా అంటూ కామెంట్ చేశాడు.