హీరోయిన్ గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఒకప్పటి హీరోయిన్ సీత కూడా అదే విధంగా మొదట హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తమిళ చిత్రపరిశ్రమ ద్వారా సీత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు టాలీవుడ్ , కోలీవుడ్ లలో సినిమాలు చేసింది. సీత తల్లిదండ్రులది విజయనగరం లోని బొబ్బిలి.. కాగా వ్యాపారం రీత్యా వీరు చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇక సీత తండ్రి సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు.
ఈ నేపథ్యంలో నే సీతకు కూడా సినిమాలు అంతే ఆసక్తి కలిగి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగు లో ఆడదే ఆధారం అనే సినిమాలో నటించి ఆకట్టుకోగా ఈ సినిమాకు గాను సీత నంది అవార్డును అందుకుంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరవాత చాలా తెలుగు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. ముద్దుల మావయ్య సినిమాలో బాలయ్య చెల్లిగా చేసిన పాత్రతో ఆమె తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.
ఇక సీత సినిమాల గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. సీత 2000 సంవత్సరంలో తమిళ నటుడు పార్డిబన్‌ను పెళ్లి చేసుకుంది. పెద్దలు వద్దని చేపినా వినుండా పెళ్లి చేసుకుంది. కాగా కొన్ని సంవత్సరాల తరవాత గొడవలు జరిగాయి. దాంతో ఇద్దరు విడాకులు సైతం తీసుకున్నారు. ముందు తల్లిదండ్రుల మాట కాదని పార్థిబన్‌ను పెళ్లి చేసుకున్నాక అతడు మోసం చేశాడని తర్వాత తెలుసుకున్నానంటూ వాపోయింది.
ఇదిలా ఆండగనే 2010 లో సీరియల్ నటుడు సతీష్ ను, పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడితో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా సీత మొదటి పెళ్లికి తల్లి తండ్రులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ మనసిచ్చిన వాడితో జీవితాన్ని పంచుకోవాలి అని మొదటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో గొడవలు అయ్యిన వెంటనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలా పేరుకు తగినట్టు గా నటి సీత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.