నటసింహ బాలకృష్ణ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య విజయశాంతి, సుహాసిని, రాధా, భానుప్రియ లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశారు. బాలయ్య కెరీర్ ప్రారంభం నుంచి 1990వ దశకం వరకు చూసుకుంటే కచ్చితంగా విజయశాంతికి తొలి ప్రాధాన్యం దక్కుతుంది. బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక క్రేజ్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి దర్శక నిర్మాతలు సైతం బాలయ్యతో సినిమా అంటే కచ్చితంగా విజయశాంతి హీరోయిన్‌గా ఉండాలనే ఫిక్స్ అయిపోయేవారు.
`
1990వ దశకం దాటిన తర్వాత వీరి కాంబోలో `లారీ డ్రైవర్`, `రౌడీ ఇన్స్పెక్టర్`, `నిప్పురవ్వ` సినిమాలు వచ్చాయి. బాలయ్య విజయశాంతి కాంబినేషన్లో చివరి సినిమాగా `నిప్పురవ్వ` నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాలేదు. విజయశాంతి తర్వాత బాలయ్యకు అంత బాగా కలిసి వచ్చిన హీరోయిన్ రోజా. బాలయ్య – రోజా జంటగా నటిస్తే అప్పట్లో ధియేటర్లలో మాస్ జనాల నుంచి ఈలలు కేకలు దద్దరిల్లి పోవాల్సిందే.
బాలయ్య రోజా కాంబినేషన్లో `భైరవద్వీపం`, `బొబ్బిలి సింహం`, `సుల్తాన్`, `పెద్దన్నయ్య`, `శ్రీకృష్ణార్జున విజయం` లాంటి సినిమాలు వచ్చాయి. బాలయ్య, రోజా కాంబినేషన్ కూడా ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు అంతే ఇష్టపడ్డారు. ఇప్పుడు రాజకీయంగా వీరిద్దరూ వేర్వేరు పార్టీలో కొనసాగుతున్నా మంచి స్నేహితులుగానే ఉంటారు. రోజా అధికార పార్టీ నుంచి మంత్రిగా ఉన్న బాలయ్యను ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు.
ఇక రోజా తర్వాత బాలయ్యకు బాగా స్పెషల్ హీరోయిన్ ఎవరంటే సిమ్రాన్. బాలయ్య సిమ్రాన్ కాంబినేషన్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్లతో పాటు సీమసింహం, ఒక్క మగాడు, గొప్పింటి అల్లుడు సినిమాలు వచ్చాయి. 2000వ దశకంలో బాలయ్యకు రెండు ఇండస్ట్రీ ఇట్లు రాగా.. ఆ రెండు సినిమాల్లోనూ సిమ్రాన్ నటించింది. అలా బాలయ్యకు చాలా స్పెషల్ హీరోయిన్‌గా నిలిచింది. ఆ తర్వాత శ్రీయ కూడా బాలయ్యతో మూడు నాలుగు సినిమాలు చేయగా అవి కూడా సక్సెస్ అయ్యాయి.